భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు*

భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు

ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనావాలా ఘటన మరిచిపోకముందే, అలాంటిదే మరొకటి వెలుగు చూసింది. కట్టుకున్న భర్త, అత్తను చంపి, ముక్కలుగా చేసింది ఓ ఇల్లాలు. తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. అసోంలోని గువాహటి సమీపంలో ఉన్న, నూన్ మటి ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. 

నిందితురాలు వందన కలితకు వివాహేతర సంబంధం కలిగి ఉండడమే ఈ హత్యలకు దారితీసినట్టు అనుమానిస్తున్నారు. భర్త అమర్ జ్యోతి దే, అత్త శంకరిదేలను, ప్రియుడి సాయంతో హత్య చేసిన వందన.. మూడు రోజుల పాటు మృతదేహాల ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టి, అనంతరం మేఘాలయలోని చిరపుంజి ప్రాంతంలో పడేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను తీసుకెళ్లి, మృతదేహాల భాగాలను గుర్తించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్ ను ఆఫ్తాబ్ చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఆ తర్వాత వాటిని సమీప అటవీ ప్రాంతంలో అక్కడక్కడ పడేయడం తెలిసిందే.

హైదరాబాద్:రాష్ట్రoలోని గ్రామపంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం ఉదయం నుంచి 7.00 గంటల కే విధులకు హాజరు కావాలని పంచాయతీ రాజ్.

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ,

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులు మంగళవారం నుంచి ఉదయం 7.00 గంటలకే విధులకు హాజరు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి దృష్ట్యా పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల నిర్వహణ, తనిఖీ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. గతంలో కార్యదర్శులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరయ్యేవారు. సాయంత్రం వరకు విధుల్లో ఉండేవారు. తాజాగా ఉదయం పూట పనివేళలను పెంచినా సాయంత్రం వరకు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఇకపై ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య వారు పంచాయతీ కార్యాలయం చేరుకొని రోజువారీ పారిశుద్ధ్య నివేదిక (డీఎస్‌ఆర్‌) యాప్‌లో తమ స్వీయచిత్రాన్ని తీసి పంపించాలి. తర్వాత గ్రామ పంచాయతీలో రోడ్లపై వ్యర్థాలు, మురుగు కాల్వలు, నీటి ట్యాంకులు, పల్లె ప్రకృతివనాలు వీధిదీపాల వద్దకు వెళ్లి అయా చోట్ల ఫొటోలు తీసి పంపించాలి. ఆ తర్వాత ఆయా పనులను మల్టీపర్పస్‌ కార్మికులతో చేయించి, ట్రాక్టర్‌ ట్రాలీ ద్వారా వ్యర్థాలను తరలించే ఫొటోలను కూడా తీసి గంటగంటకూ పంపించాలి. వీధిదీపాలు ఎన్ని వెలుగుతున్నాయి, ఎన్ని వెలగడం లేదు? అనే సమాచారం తెలపాలి. అన్ని వివరాలుంటేనే ఆ రోజు హాజరును నమోదు చేస్తామని పేర్కొంది. వేసవిలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువ కావడంతో పాటు తాగునీటి సరఫరాను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించానికి వీలుగా మరింత పర్యవేక్షణ కోసం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంత మంది యాప్‌లో తప్పుడు సమాచారం ఇస్తున్నందున ఆయా కార్యదర్శులకు వీడియోకాల్‌ చేసి తనిఖీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది.

పనివేళల నిర్ధారణ ఎప్పుడు ?

రాష్ట్రంలో 9,533 మంది గ్రామ కార్యదర్శులున్నారు. వీరిలో ఎనిమిది వేల మంది వరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు కాగా.. మిగిలిన వారు పొరుగుసేవల కార్యదర్శులు. ఇప్పటివరకు పనివేళలు నిర్ధారణ కాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమయాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దాదాపు మూడు వేల మంది రెండేసి గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధులు చేయాల్సి వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం యాప్‌లో ఒకేసారి రెండు చోట్ల ఫొటోలు దిగి నమోదు చేయడం ఎలా? అని వారు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ ప్రక్రియ, పూర్తిస్థాయి వేతనాల చెల్లింపుల సమస్యలూ అపరిష్కృతంగా ఉన్నాయని కార్యదర్శులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ జాషువా*

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ జాషువా

కృష్ణా జిల్లా

గన్నవరం నియోజకవర్గ పరిధిలో నిన్న జరిగిన టిడిపి వైసిపి శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు టిడిపి శ్రేణులు చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు. 

తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి, విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురి గొల్పడం బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైంది.దీనివల్ల విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిఐ కనకారావు తలకు బలమైన గాయమైంది.

పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది.

తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడి కి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం.

సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది.

చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు.

గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉంది.

ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదు. 

గన్నవరం పరిసర ప్రాంతాలకు 

ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

 

చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించవలసినదిగా జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ పత్రిక ముఖంగా తెలియజేశారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి

రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి

క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Streetbuzz news:నల్గొండ జిల్లా :

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కట్టంగూర్ మండల హైస్కూల్ స్టటంర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు మంగళవారం నాడు వారు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ....క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలలో రాణించాలని అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి : గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని కౌశిక్ రెడ్డిని సూచించింది..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. తమిళిసై పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు ఢిల్లీలో కమిషన్ ముందు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు..

నేను ఎవరి జోలికి వెళ్లను... నా జోలికి వస్తే వదలను: వల్లభనేని వంశీ*

నేను ఎవరి జోలికి వెళ్లను... నా జోలికి వస్తే వదలను: వల్లభనేని వంశీ

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. బయటి వాళ్లు వచ్చి గన్నవరంలో గొడవ చేశారని, కేవలం తన అనుచరులే దాడికి దిగారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. బయటివాళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటని వంశీ ప్రశ్నించారు. గన్నవరంలో జరిగే ప్రతి ఘటనతో నాకేంటి సంబంధం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను ఎవరిపైనా ఫస్ట్ అటాక్ చేయనని, తన జోలికి వస్తే మాత్రం వదలనని స్పష్టం చేశారు. తానే కాదు, కొడాలి నాని కూడా ఇలాగే వ్యవహరిస్తాడని తెలిపారు. సంకల్పసిద్ధి కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, న్యాయం తనవైపే ఉందని స్పష్టం చేశారు. 

చంద్రబాబు చరిత్ర తనకు, కొడాలి నానికి తెలుసని, అందుకే వారి నేతలను తమపై ఉసిగొల్పుతున్నాడని వంశీ మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, మామూలు విషయాలకు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. 

చంద్రబాబు ప్రజల కంటే ఎక్కువగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకుంటాడని, చంద్రబాబు చేయగలిగిన ఏకైక పని గుడ్డకాల్చి ముఖంపై వేయడమేనని, అందులో ఆయన సిద్ధహస్తుడని విమర్శించారు. కొడాలి నాని, తాను కూడా చేతులు కట్టుకుని ఏమీ లేమని, తాము కూడా ఆ స్కూలు నుంచి వచ్చిన వాళ్లమేనని వంశీ హెచ్చరించారు.

బాధితురాలిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు*

బాధితురాలిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలం టేకులగూడేం గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు యంపాల మల్లారెడ్డి భార్య జ్యోతి ఇటివలే రోడ్డు ప్రమాదంలో గాయపడగ,వారి ఇంటి కెల్లి పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు,

(ఈకార్యక్రమంలో)

పాలెం ఉపసర్పంచ్ పక్కీర్ మల్లారెడ్డి,అంజయ్య, లింగారెడ్డి,వెంకటేష్, మహేష్, అశోక్,తధితరులు పాల్గొన్నారు.

ఏపీ :సీఎం జగన్‌ ట్వీట్‌లో తప్పేముంది: బీజేపీకి మంత్రి బొత్స సూటి ప్రశ్న

సీఎం జగన్‌ ట్వీట్‌లో తప్పేముంది?: బీజేపీకి మంత్రి బొత్స సూటి ప్రశ్న

Streetbuzz news :నల్గొండ జిల్లా :

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని, ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన: మంత్రి బొత్స

శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌లో తప్పేముందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీజేపీ రోజురోజుకు దిగజారి వ్యవహరిస్తోంది. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్‌ అని మంత్రి ప్రశ్నించారు. ''బీజేపీకి రాష్ట్రంలో అవకాశాలు లేవు. బీజేపీ నేతలే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన'' అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు..

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు*

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు

Streetbuzz news : నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలం చందుపట్ల 

గ్రామానికి చెందిన చింతమళ్ళ బాస్కర్(23) అకాలమరణం చెందగ చిన్న వయస్సులో కూమారుడు చనిపోయి దీనావస్తలో వున్న కుటుంబ సభ్యులను ఓదార్చి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి అనంతరం మాగి పెద్దమల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారిని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు,

ఈకార్యక్రమంలో.

మత్యసంఘం కోశాధికారి మంగినపల్లి వెంకటయ్య ,బెజవాడ లక్ష్మీనారాయణ,

కోటగిరి రాధాకృష్ణ,జిల్లా ప్రవీణ్,పుట్ట రాజు,బుడిగె మాహేష్,జిల్లా సంపత్,చింతమళ్ళ నరేష్, కోటగిరి నాగరాజు,పుట్ట సందీప్,పోతుల వెంకన్న,కుర్ర వీరయ్య,తాడ్వాయి సంపత్, కొప్పు సందీప్,యశ్వంత్, శివ,పరుషరాం,సంపత్,శంకర్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు*

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Streetbuzz news :నల్గొండ జిల్లా :

బిఎస్పి చిట్యాల మండల కమిటీ, నకిరేకల్ నియోజకవర్గ కమిటీ 

ఆధ్వర్యంలో, బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి, చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్పి జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు, జిల్లా ఇంచార్జి లు ఆదిమల్ల గోవర్ధర్, పంబాల అనిల్ మాట్లాడుతూ. ఛత్రపతి శివాజీ మహారాజ్, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతీ, యువకులు కుల మతాలకు ఆతీతంగా ఆదర్శంగా తీసుకోని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వేలాలని, తమ రోజువారి జీవితంలో దేశం పట్ల ధర్మం పట్ల శివాజీ స్పూర్తిని తీసుకొని ముందుకు సాగాలని నమనమాజ స్థాపన యొక్క గొప్పతనాన్ని, అవసరాన్ని ప్రతీ ఒక్కరికి తెలిపే విధంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసి మెంబెర్ గ్యార మారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్షిరాం, జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ అధ్యక్షులు ఏరసాని జంగయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్,చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతికుమార్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, రామన్నపేట కోశాధికారి రమేష్, గద్దపాటి రమేష్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.