క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం.
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి
రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి
క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
Streetbuzz news:నల్గొండ జిల్లా :
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కట్టంగూర్ మండల హైస్కూల్ స్టటంర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు మంగళవారం నాడు వారు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ....క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలలో రాణించాలని అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
Feb 21 2023, 12:40