madagoni surendar

Feb 21 2023, 12:18

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి

రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి

క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Streetbuzz news:నల్గొండ జిల్లా :

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కట్టంగూర్ మండల హైస్కూల్ స్టటంర్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు మంగళవారం నాడు వారు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ....క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలలో రాణించాలని అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Feb 21 2023, 08:39

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి : గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని కౌశిక్ రెడ్డిని సూచించింది..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. తమిళిసై పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు ఢిల్లీలో కమిషన్ ముందు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు..

madagoni surendar

Feb 21 2023, 08:35

నేను ఎవరి జోలికి వెళ్లను... నా జోలికి వస్తే వదలను: వల్లభనేని వంశీ*

నేను ఎవరి జోలికి వెళ్లను... నా జోలికి వస్తే వదలను: వల్లభనేని వంశీ

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. బయటి వాళ్లు వచ్చి గన్నవరంలో గొడవ చేశారని, కేవలం తన అనుచరులే దాడికి దిగారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. బయటివాళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటని వంశీ ప్రశ్నించారు. గన్నవరంలో జరిగే ప్రతి ఘటనతో నాకేంటి సంబంధం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను ఎవరిపైనా ఫస్ట్ అటాక్ చేయనని, తన జోలికి వస్తే మాత్రం వదలనని స్పష్టం చేశారు. తానే కాదు, కొడాలి నాని కూడా ఇలాగే వ్యవహరిస్తాడని తెలిపారు. సంకల్పసిద్ధి కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, న్యాయం తనవైపే ఉందని స్పష్టం చేశారు. 

చంద్రబాబు చరిత్ర తనకు, కొడాలి నానికి తెలుసని, అందుకే వారి నేతలను తమపై ఉసిగొల్పుతున్నాడని వంశీ మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, మామూలు విషయాలకు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. 

చంద్రబాబు ప్రజల కంటే ఎక్కువగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకుంటాడని, చంద్రబాబు చేయగలిగిన ఏకైక పని గుడ్డకాల్చి ముఖంపై వేయడమేనని, అందులో ఆయన సిద్ధహస్తుడని విమర్శించారు. కొడాలి నాని, తాను కూడా చేతులు కట్టుకుని ఏమీ లేమని, తాము కూడా ఆ స్కూలు నుంచి వచ్చిన వాళ్లమేనని వంశీ హెచ్చరించారు.

madagoni surendar

Feb 20 2023, 21:01

బాధితురాలిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు*

బాధితురాలిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలం టేకులగూడేం గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు యంపాల మల్లారెడ్డి భార్య జ్యోతి ఇటివలే రోడ్డు ప్రమాదంలో గాయపడగ,వారి ఇంటి కెల్లి పరామర్శించిన బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు,

(ఈకార్యక్రమంలో)

పాలెం ఉపసర్పంచ్ పక్కీర్ మల్లారెడ్డి,అంజయ్య, లింగారెడ్డి,వెంకటేష్, మహేష్, అశోక్,తధితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 19 2023, 17:01

ఏపీ :సీఎం జగన్‌ ట్వీట్‌లో తప్పేముంది: బీజేపీకి మంత్రి బొత్స సూటి ప్రశ్న

సీఎం జగన్‌ ట్వీట్‌లో తప్పేముంది?: బీజేపీకి మంత్రి బొత్స సూటి ప్రశ్న

Streetbuzz news :నల్గొండ జిల్లా :

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని, ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన: మంత్రి బొత్స

శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌లో తప్పేముందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీజేపీ రోజురోజుకు దిగజారి వ్యవహరిస్తోంది. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్‌ అని మంత్రి ప్రశ్నించారు. ''బీజేపీకి రాష్ట్రంలో అవకాశాలు లేవు. బీజేపీ నేతలే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన'' అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు..

madagoni surendar

Feb 19 2023, 16:51

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు*

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు

Streetbuzz news : నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలం చందుపట్ల 

గ్రామానికి చెందిన చింతమళ్ళ బాస్కర్(23) అకాలమరణం చెందగ చిన్న వయస్సులో కూమారుడు చనిపోయి దీనావస్తలో వున్న కుటుంబ సభ్యులను ఓదార్చి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి అనంతరం మాగి పెద్దమల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారిని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు,

ఈకార్యక్రమంలో.

మత్యసంఘం కోశాధికారి మంగినపల్లి వెంకటయ్య ,బెజవాడ లక్ష్మీనారాయణ,

కోటగిరి రాధాకృష్ణ,జిల్లా ప్రవీణ్,పుట్ట రాజు,బుడిగె మాహేష్,జిల్లా సంపత్,చింతమళ్ళ నరేష్, కోటగిరి నాగరాజు,పుట్ట సందీప్,పోతుల వెంకన్న,కుర్ర వీరయ్య,తాడ్వాయి సంపత్, కొప్పు సందీప్,యశ్వంత్, శివ,పరుషరాం,సంపత్,శంకర్, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 19 2023, 16:30

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు*

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Streetbuzz news :నల్గొండ జిల్లా :

బిఎస్పి చిట్యాల మండల కమిటీ, నకిరేకల్ నియోజకవర్గ కమిటీ 

ఆధ్వర్యంలో, బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి, చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్పి జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు, జిల్లా ఇంచార్జి లు ఆదిమల్ల గోవర్ధర్, పంబాల అనిల్ మాట్లాడుతూ. ఛత్రపతి శివాజీ మహారాజ్, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతీ, యువకులు కుల మతాలకు ఆతీతంగా ఆదర్శంగా తీసుకోని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వేలాలని, తమ రోజువారి జీవితంలో దేశం పట్ల ధర్మం పట్ల శివాజీ స్పూర్తిని తీసుకొని ముందుకు సాగాలని నమనమాజ స్థాపన యొక్క గొప్పతనాన్ని, అవసరాన్ని ప్రతీ ఒక్కరికి తెలిపే విధంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసి మెంబెర్ గ్యార మారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్షిరాం, జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ అధ్యక్షులు ఏరసాని జంగయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్,చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతికుమార్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, రామన్నపేట కోశాధికారి రమేష్, గద్దపాటి రమేష్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 19 2023, 10:17

Ap :27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు* *రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు*

27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు

తొలుత రెండ్రోజుల పాటు సమావేశాలు

రెండో విడత మార్చి 6న ప్రారంభం

13 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

వెలగపూడి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మొదటి రోజున గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటాయి. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా ప్రకటన ఉంటాయి. ఇక రెండో విడత సమావేశాలు మార్చి 6న ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే, అసెంబ్లీ సమావేశాలు రెండు విడతల్లో జరపనున్నట్టు తెలుస్తోంది.

madagoni surendar

Feb 17 2023, 20:09

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన ఎంపీపీ*

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన ఎంపీపీ

Streetbuzz news :నల్గొండ జిల్లా :

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వం లో  ఎంపీపీ జెల్లా ముతిలింగయ్య కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేసి అనంతరం. ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య& మాజి జెడ్పిటిసి మాద యాదగిరి మాట్లాడుతూ.. భారతదేశంలో రైతాంగ ప్రజా వ్యతిరేక విధనాలకు పట్లుపడుతున్న మోడీ ప్రభుత్వానికి బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పే దిశగా బి అర్ ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అని అన్నారు దేశంలో బిజెపి పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని అరికట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం పాలన కొనసాగాలంటే బి ఆర్ ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వాన్ని సాధ్యమైద్దని దేశ ప్రజలు నమ్ముతూ స్వాగతిస్తున్నారు రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవుతారని అన్నారు దేశలో అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వములో బి ఆర్ ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతున్నారు అని అన్నారు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బి ఆర్ ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరడం ద్వారానే కెసిఆర్ భారతదేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని క్రియాశీలక శక్తులంతా ఏకమై దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని దేశ అభివృద్ధికి ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో సర్పంచులు చేనగాని సతీష్ రేణుక అయితేగొని నారాయణ,సుంకరబోయిన వెంకన్న,మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, మాజీ సర్పంచ్ గడుసు శంకర్ రెడ్డి,మాజీ రెపరండం సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గద్దపాటి దానయ్య,ఎం ఎస్ ఆర్ చైర్మన్ మంగదుడ్ల శ్రీనివాస్, వనం రాంబాబు, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 17 2023, 19:59

నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన కొండేటి మల్లయ్య*

నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన కొండేటి మల్లయ్య 

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలం గార్లబాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో తేలువారిగూడెం లో నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవస్థానం నిర్మాణం కోసం 50,000 రూపాయల విరాళం.అందజేసిన            

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య,ఈ కార్యక్రమంలో. నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమీరుద్దీన్,తేలు లింగయ్య,తేలు నాగయ్య తేలు భద్రయ్య,కడారి సైదులు,తేలు వెంకన్న,తేలు లింగయ్య,బొప్పని యాదగిరి,కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ మండల యువజన నాయకులు ఆవుల వేణు,తదితరులు పాల్గొన్నారు.