బీజేపీ హాయంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం - ఆదానీకి అండగా మోడీ
సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ప్రెస్ మీట్ పాయింట్స్
బీజేపీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం
ఆదానీకి అండగా మోడీ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ ఏం అభివృద్ధి చేసాడు
డబుల్ బెడ్ రూం లు పంపిణీ చేయకపోతే పేదలచే ఆక్రమిస్తాం
సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
Street Buzz news కరీంనగర్ జిల్లా:
(కరీంనగర్ ):- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం తో పాటు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నదని, ఆదానీకి అండగా మోడీ ఉన్నారని,లక్షల కోట్ల సంపదను ధారాదత్తం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫి చేస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని,పేదలు,రైతులు బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు చెల్లించకపోతే మాత్రం వారి వద్ద వసూలు చేస్తారని రానున్న రోజుల్లో మోడీ కి తగిన గుణపాఠం చెప్పాలని,ఆదానీ స్టాక్స్ వ్యవహారం పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ అయిన బి.బి.సి కార్యాలయం పై ఐటీ దాడులు చేయడం వెనుక మోడీ ప్రభుత్వ హస్తం ఉందని,ప్రజల సమస్యలను,ప్రభుత్వ అవినీతిని బయటకు తెస్తున్న పత్రికలపై, మీడియా పై పాలక ప్రభుత్వాలు కష్ట సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల స్వేచ్ఛను హరిస్తున్న పాలకులపై ప్రజలు తిరగబడి పోరాడాలని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని తను ఎన్నికై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా నియోజక వర్గానికి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చి ఏమి అభివృద్ధి సాధించారో ప్రజలకు వివరించాలని, నిత్యం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శించడమే పనిగట్టుకొని రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తూ జైశ్రీరామ్,భారత్ మాతాకీ జై అంటూ యువతరాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని వెంకటస్వామి ఆరోపించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా తన మాటల గారడీతో కాలయాపన చేస్తున్నాడని,రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని చేయకపోవడం బాధాకరమని పోడు భూములపై సీపీఐ గత అనేక సంవత్సరాలుగా పోరాడుతుందని, భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు,పేదవారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు నిర్వహించిందని ముఖ్యమంత్రి మాత్రం పోడు భూముల సాగుదారులపై ఆంక్షలు విధిస్తూ పోరాటాల నిర్వహించిన వారిని చులకన చేసి మాట్లాడడం సరైనది కాదని, దేవాలయాలకు వందల కోట్ల రూపాయలు ప్రకటించడం మాకేం అభ్యంతరం కాదు కానీ కనీసం ఉండడానికి ఇల్లు లేని,ఇంటి స్థలం లేని నిరుపేదలు అనేకమంది ఉన్నారని వారికి నీడ కల్పించాలనే ధ్యాస లేకపోవడం బాధాకరమని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి యేండ్లు గడుస్తున్నా వాటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని శివరాత్రి తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదలకు కేటాయించకపోతే నిరుపేదలందరినీ ఏకం చేసి సీపీఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలచే ఆక్రమిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటస్వామి హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి,జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,పైడిపెల్లి రాజు,కిన్నెర మల్లవ్వ, బ్రామండ్ల పెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్ పాల్గొన్నారు.
Feb 20 2023, 11:24