నిరంకుశ దొర పాలనపై దండయాత్ర - నీల రాజు కురుమ
తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ దొరల పాలన కొనసాగుతుందని, ఆ దొరల గడీల పాలన పై ప్రజలు, మేధావులు, నిరుద్యోగ యువత ఏకమవ్వాలని యూత్ కాంగ్రెస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు నీల రాజు కురుమ పిలుపునిచ్చారు. శనివారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీల రాజు కురుమ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జూడో పాదయాత్ర మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చేరుకుంటుందని, మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తుతూ, భూపాలపల్లిలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడం లక్ష్యంగా హాత్ సే హాత్ జోడ యాత్ర కొనసాగుతుందని, అనంతరం మండలంలోని ఇసిపేట రంగపురం గ్రామాల మీదుగా పరకాల నియోజకవర్గానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ జూడో యాత్రను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నీల రాజు కురుమ విజ్ఞప్తి చేశారు.
Feb 20 2023, 09:57