మాముళ్ళ మత్తు వదలని అధికారులు - యధేచ్చగా అక్రమ ఇసుక రవాణా


 పేదోడి ఇంటికి ఇసుక కరువు..కమర్షియల్ భవనానికి అక్రమంగా ఇసుక తరలింపు  

 నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

 ట్రాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతుల వేడుకోలు

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ;(మొగుళ్ళపల్లి):- మండలంలోని ఒక గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధి తన గ్రామ సరిహద్దుల్లో ఉన్న కమర్షియల్ భవన నిర్మాణానికి అన్ని తానై వ్యవహరిస్తూ గత కొన్ని రోజుల నుండి మండలంలోని సమీప గ్రామాలకు చెందిన వాగుల నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా యథేచ్చగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడు. గత పది రోజుల నుండి గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా, పలు పత్రికలలో వార్తలు ప్రచురితమైన కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో అధికారుల అండదండలు నాకు ఉన్నాయంటూ గురువారం కూడా సమీప గ్రామాల నుండి కమర్షియల్ భవనానికి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు. ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ బృందాలతో విచారణ చేపట్టి.. కమర్షియల్ భవన నిర్మాణం వద్ద ఉన్న ఇసుక డంప్ లను సీజ్ చేసి, ఆ ప్రజాప్రతినిధిపై చట్టరీత్యా చర్యలు తీసుకోని, అక్రమ ఇసుక రవాణాను ఆపాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిర్లక్ష్యం


●RSP సిద్దిపేట జిల్లా నాయకులు గడిపే సుజిత్ ●

Street Buzz news సిద్దిపేట జిల్లా:: ;(హుస్నాబాద్ ):- హుస్నాబాద్ ఎమ్మెల్యే  వొడితల సతీష్ కుమార్ నిర్లక్ష్యం వల్ల పేదలకు చెందవలసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఈరోజు డబ్బులకు ఇచ్చిన వారికి చెందుతున్నాయని RSP పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రివలేషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకుడు గడిపే సుజిత్ కుమార్ మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వార్డ్ బిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని అని చెప్పడం సిగ్గుచేటని మండి పడ్డారు. వెంటనే పేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ లను అన్నింటిని అర్హులైన పేదలకు ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల నాయకులు మధురవేణి అజయ్ ,సాయి నరేష్, దుర్ముట్ల శివ,చందు,గద్ద శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విమాన రాకపోకల సమయాలు ఇవే

Street Buzz news కడప:  

కడప విమాన సర్వీసులు,కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ

కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, మైసూరు

కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్‌, హుబ్లీ, లక్నోలకు

విమానం వచ్చి.. వెళ్లే సమయం

చెన్నై-కడప : 08.05 - 09.20

కడప-చెన్నై : 14.00 - 15.20

కడప-విజయవాడ : 09.45 - 11.00

విజయవాడ-కడప : 11.45 - 13.20

బెంగళూరు-కడప : 09.25 - 10.30

కడప-బెంగళూరు : 15.10 - 16.15

కడప-విశాఖపట్నం : 10.50 - 12.40

విశాఖపట్నం-కడప : 13.00 - 14.50

హైదరాబాద్‌-కడప : 09.45 - 11.05

కడప-హైదరాబాద్‌ : 11.35 - 13.05

విమానాల రాకపోకలు ఇవే...

కడప-హైదరాబాద్‌ : ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

కడప-విజయవాడ-కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

చెన్నై-కడప-చె న్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం

కడప-విశాఖపట్నం-కడప : మంగళ, గురు, శనివారం

సర్వీసులను ఉపయోగించుకోండి

- శివప్రసాద్‌, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్

 -- ఆకాశయానం ✈️✈️✈️

సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే భాజాపాకు రాజీనామా - కన్నా

Street Buzz news గుంటూరు:- 

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై భాజపా(BJP)లో చేరానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు..

చేరినప్పటి నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని.. దాన్ని గుర్తించే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. 

అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ప్రవర్తన బాగాలేకనే భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

అయితే మోదీపై ఉన్న అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరని చెప్పారు. 

త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. 

గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు..

''2014లో భాజపాలో చేరా. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చా. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. 

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి 2019 ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించా. 

2024 ఎన్నికల్లో ఏపీలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశా. 

సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశా. 

ప్రజల తరఫున అనేక సమస్యలపై పోరాడా. 

కరోనా తర్వాత నన్ను మార్చి సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేశారు. 

ఆయన ప్రవర్తన నచ్చకే రాజీనామా చేశా. 

స్థానిక నాయకుల వైఖరి కారణంగా పార్టీలో మనుగడ సాగించలేను. 

నాతో పాటు రాజీనామా చేసిన మిత్రులకు ధన్యవాదాలు'' అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

వంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మవేయడం తెలుగుజాతికి దక్కిన గౌరవం


◆యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి◆

Street Buzz news పెద్దపల్లి జిల్లా:

(రామగుండం):- గోదావరిఖని ఫిబ్రవరి 16 :- ఆంధ్రుల ఆరాధ్యదైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుగారి బొమ్మతో వందరూపాయల వెండి నాణెం ముద్రణకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల్లో రాణించి, పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, ప్రతి పౌరాణిక పాత్రకు సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్ అని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయనే చిరునామా అని అదేవిధంగా రాజకీయాల్లో చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా జనం గుండెల్లో సజీవంగానే ఉన్నారు అని అటు సినీ రంగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, రాజకీయరంగంలో ఇంకెవ్వరికీ సాధ్యం కానీ విధంగా చరిత్ర సృష్టించారు అని తెలిపారు. తెలుగోడి ఆత్మగౌరవం నినాదంతో 1982 పసుపు జెండాను ఎగురవేశారు అని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీని ప్రకటించి 9 నెలలు తిరగకుండానే ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు అని అన్నారు. ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు అని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం తెలుగు ప్రజలకు శుభవార్త అందించి ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణాన్ని త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటిండాన్ని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి నందమూరి సేవా సమితి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇదే సందర్భంలో నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలి అని కోరారు.

టి,ఎస్,జే,ఏ కోదాడ పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ మజార్ నియామకం

Street Buzz news సూర్యాపేట జిల్లా :

కోదాడ(టౌన్ న్యూస్ ):- తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ కోదాడ పట్టణ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ మజార్ నియమించారు.ఈ మేరకు గురువారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు మజార్ నియమిస్తూ ప్రకటన చేశారు.ఈ సందర్భంగా మజార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు

దస్తురాబాద్ ఎస్.ఐ ని మర్యాద పూర్వకంగా కలసిన విబిఏ జిల్లా అద్యక్షులు

దస్తురాబాద్ ఎస్.ఐ బి. ప్రకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన విబిఏ జిల్లా ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ 

Street Buzz news నిర్మల్ జిల్లా: 

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ ఎస్.ఐ గా బి ప్రభాకర్ రెడ్డి పదవిబాద్యతలు చేపట్టగా వారిని మర్యాదపూర్వకంగా వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఎస్ సి, ఎస్ టి బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ కలిసి అభినందనలు తెలియజేశారు.గత పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఏది ఏమైన శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉండాలని చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు మంచి చేయాలని ఎస్.ఐ బి.ప్రబాకర్ రెడ్డి అన్నారు.

కొనుగోలు కేంద్రంలో గోల్ మాల్


పెద్దకమిటీపల్లిలో నిర్వాహకుల దందా

 రైతులకు రూ 5.80 లక్షల టోకరా

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:  

(మొగుళ్లపల్లి):- మండలంలోని పెద్దకోమటిపల్లి గ్రామంలో రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గోల్ మాల్ దందా కొనసాగినట్లు రైతులు ఆరోపించారు. రైతులు కొనుగోలు కేంద్రం కు వరి ధాన్యం తీసుకురాగా ముందస్తుగానే తరుగు పేరుతో రెండు కిలోల కోత విధించడం గమనార్హం. రైతులు విక్రయించిన ధాన్యానికి ధర చెల్లించడంలో ఒక్కొక్కరి వద్ద తరుగు పేరుతో మరింత దోపిడికి గురిచేసి రైతుల వద్ద నుంచి అదనంగా రూ 5.80 లక్షల వరకు మొత్తంగా టోకరా వేసినట్లు రైతులు తెలిపారు.

₹- 1.40/- కోట్లతో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మొగుళ్లపల్లి మండలంలో రూ.1.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర

 ఇస్సిపేటలో సర్పంచ్ కోడారి సునీత రమేష్ యాదవ్ తో కలిసి సిసి రోడ్లకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర  

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్ళపల్లి):- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మొగుళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. బుధవారం రోజున మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం, ఇస్సిపేట, మెదరమట్ల, అంకుశపూర్, మొగుళ్లపల్లి గ్రామాలలో రూ.1.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మొగుళ్లపల్లి మండల ముదిరాజ్ కమ్యూనిటీ హల్ వద్ద కొత్త బోర్ ప్రారంభోత్సవానికి పాలకాయ సమర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న వారికి ప్రత్యేక కళ్ళజోడులను పంపిణి చేశారు.భారతీయ జనతా పార్టీ దళితమోర్చ మండల అధ్యక్షుడు మంద జగన్నాథం BRS పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే రమణారెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఐకేపి ఏపీఎం వెంకన్న ను సన్మానించిన ఎస్ బి ఐ , ఎడిబి బ్యాంక్ అధికారులు

Street Buzz news సూర్యాపేట జిల్లా:

(సూర్యాపేట):- ఎస్,బి,ఐ బ్యాంక్ మెగా ఋణమేల సందర్భంగా బుధవారం సూర్యాపేట మండలం సంబంధించిన 15 స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 26 లక్షల రూపాయల మైక్రో క్రెడిట్ ప్లాన్ (సూక్ష్మ ఋణ ప్రణాళిక) ఋణాలు అందించాలని ఋణ ప్రణాళికను తయారుచేసి బ్యాంకు అధికారులకు అందించడం జరిగిందనీ ఈ సందర్భంగా బ్యాంకు వారితో ఏ పీఎం వెంకన్న మాట్లాడుతూ ఈ సంవత్సరం టార్గెట్ పూర్తి చేయుటకు సహకరించాలని కోరగా బ్యాంకు అధికారులు అందుకు స్పందించి అర్హత గల అన్ని సంఘాలకు ఋణాలు అందిస్తామని చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా సంఘాల కోసం ఐకెపి సిబ్బంది కృషి చేయడం అభినందనీయంమని తెలుపుతూ రికవరీ 98% ఉన్న కారణంగా ఏపీఎం వెంకన్నను అదేవిధంగా సిసి లను సిబ్బందిని అభినందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏ పీఎం వెంకన్నను సన్మానిస్తున్నామని తెలిపారు.పీఎం ఎఫ్ఎంఈ స్కీం కింద ముగ్గురు లబ్ధిదారులకు డిపిఆర్లు పూర్తిచేసి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మహిళా సంఘాలకు ఋణాలు అందించేందుకు తమ బ్యాంకు ఎల్లవేళలా ముందుంటుందని ఆర్ఎం కృష్ణమోహన్ తెలిపారు. ఐకెపి సిబ్బంది సీసీలు(ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్) ద్వారా సూర్యాపేట మండల సమ భావన సంఘాలకు ఇప్పించేందుకు కృషి చేసిన సూర్యపేట మండల ఐకెపి ఏపిఎం రణపంగా వెంకన్నను సూర్యాపేట జిల్లా కేంద్రానికి సంబంధించిన ఎస్బిఐ ఎడిబి ఆర్ఎం కృష్ణమోహన్ అదేవిధంగా బ్యాంకు అధికారులు సిబ్బంది బుధవారం శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా బ్యాంకు ఆర్ఎం కృష్ణమోహన్ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఏపిఎం వెంకన్న చేసిన కృషి అభినందనీయం అన్నారు. చిత్తశుద్ధి కలిగి విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని సన్మానించి ప్రోత్సహించాలని అప్పుడే ఇంకా తమ తమ బాధ్యతలను ఎక్కువగా నిర్వర్తిస్తారని తెలిపారు. అదేవిధంగా ఏపిఎం వెంకన్న మాట్లాడుతూ పై అధికారుల సూచనలు సలహాలు ప్రోత్సాహంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి గా 35 అయిదు కోట్ల 77 లక్షల రూపాయలు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారుగా 30 కోట్ల వరకు స్వయం సహాయక సంఘాలకు ఋణాలు అందించడం జరిగిందన్నారు.అన్ని బ్యాంకుల ద్వారా ఋణాలు అందించామని తెలిపారు. అదేవిధంగా శ్రీనిధి ద్వారా టార్గెట్ 8 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు ఏడు కోట్ల రూపాయలు ఋణాలు అందించడం జరిగిందని వివరించారు.బ్యాంకు ద్వారా మిగిలిన టార్గెట్ మార్చి నెల ఆఖరి వరకు అందే విధంగా చూస్తామని ఏపీఎం తెలిపారు.ఈ ఋణాల ద్వారా మహిళ సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఇందుకు సహకరించిన రీజనల్ బ్యాంకు మేనేజర్ కృష్ణమోహన్ కు అదేవిధంగా బ్యాంకు అధికారులందరికీ అదేవిధంగా ఐకెపి,శ్రీనిధి అధికారులకు సిబ్బంది కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు