మాముళ్ళ మత్తు వదలని అధికారులు - యధేచ్చగా అక్రమ ఇసుక రవాణా
పేదోడి ఇంటికి ఇసుక కరువు..కమర్షియల్ భవనానికి అక్రమంగా ఇసుక తరలింపు
నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
ట్రాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతుల వేడుకోలు
Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మొగుళ్ళపల్లి):- మండలంలోని ఒక గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధి తన గ్రామ సరిహద్దుల్లో ఉన్న కమర్షియల్ భవన నిర్మాణానికి అన్ని తానై వ్యవహరిస్తూ గత కొన్ని రోజుల నుండి మండలంలోని సమీప గ్రామాలకు చెందిన వాగుల నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా యథేచ్చగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడు. గత పది రోజుల నుండి గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా, పలు పత్రికలలో వార్తలు ప్రచురితమైన కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో అధికారుల అండదండలు నాకు ఉన్నాయంటూ గురువారం కూడా సమీప గ్రామాల నుండి కమర్షియల్ భవనానికి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు. ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ బృందాలతో విచారణ చేపట్టి.. కమర్షియల్ భవన నిర్మాణం వద్ద ఉన్న ఇసుక డంప్ లను సీజ్ చేసి, ఆ ప్రజాప్రతినిధిపై చట్టరీత్యా చర్యలు తీసుకోని, అక్రమ ఇసుక రవాణాను ఆపాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Feb 17 2023, 08:09