తారకరత్న మృతి పట్ల గోదావరి ఖని లో సంతాపం
•యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి•
Street Buzz news పెద్దపల్లి జిల్లా:
(గోదావరిఖని ఫిబ్రవరి 19 )-
నందమూరి తారకరత్న మృతిపట్ల నేడు ఆదివారం ఎన్ టి పి సి లో యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి సంతాపం వ్యక్తం చేశారు. గత 23 రోజులు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆయన శని వారం తుదిశ్వాస విడవడాన్ని నమ్మశక్యంగా లేదు అని అన్నారు జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మొదటి రోజు గుండెపోటుతో కుప్పకూలి అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై మృత్యువు తో పోరాడి విదిరాత ముందు వొడి పోయారు అని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కోలుకొని తిరిగి రావాలని తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు అని ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ దగ్గర ఉండి ఆయన ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు అహర్నిశలు శ్రమించారు అని అన్నారు.
తారకరత్న ఫిబ్రవరి 22, 1983లో నందమూరి మోహనకృష్ణ, శాంతి దంపతులకు జన్మించారు అని సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా తారకరత్న సినీ రంగ ప్రవేశం చేశాడు అని నందమూరి మోహన కృష్ణ తనయుడు గా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చి ఒకే రోజు 9 సినిమాలకు పూజ చేసి సంచలన వరల్డ్ రికార్డ్ సృష్టించారు అని అన్నారు. 2012 ఆగష్టు 2న సంఘీ టెంపుల్లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో అలేఖ్యరెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు అని తెలిపారు. దాదాపు 23 చిత్రాల్లో హీరో, ప్రతినాయకుడు, క్యారెక్టర్ రోల్స్ పోషించి మెప్పించారు అని అన్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తారకరత్న రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాడు అని ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకొని రాజకీయాల్లోకి వచ్చే క్రమం లో ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. తారకరత్న మృతి పట్ల యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ కార్యక్రమం లో అభిమానులు భరద్వాజ్, సిద్దార్థ, జయేంద్ర, హోత్రి తదితరులు ఉన్నారు.
Feb 20 2023, 10:36