ఏపీ :సీఎం జగన్‌ ట్వీట్‌లో తప్పేముంది: బీజేపీకి మంత్రి బొత్స సూటి ప్రశ్న

సీఎం జగన్‌ ట్వీట్‌లో తప్పేముంది?: బీజేపీకి మంత్రి బొత్స సూటి ప్రశ్న

Streetbuzz news :నల్గొండ జిల్లా :

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని, ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన: మంత్రి బొత్స

శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌లో తప్పేముందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీజేపీ రోజురోజుకు దిగజారి వ్యవహరిస్తోంది. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్‌ అని మంత్రి ప్రశ్నించారు. ''బీజేపీకి రాష్ట్రంలో అవకాశాలు లేవు. బీజేపీ నేతలే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే వారి ఆలోచన'' అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు..

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు*

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు

Streetbuzz news : నల్గొండ జిల్లా :

నకిరేకల్ మండలం చందుపట్ల 

గ్రామానికి చెందిన చింతమళ్ళ బాస్కర్(23) అకాలమరణం చెందగ చిన్న వయస్సులో కూమారుడు చనిపోయి దీనావస్తలో వున్న కుటుంబ సభ్యులను ఓదార్చి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి అనంతరం మాగి పెద్దమల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారిని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చుపల్లి గంగాధర్ రావు,

ఈకార్యక్రమంలో.

మత్యసంఘం కోశాధికారి మంగినపల్లి వెంకటయ్య ,బెజవాడ లక్ష్మీనారాయణ,

కోటగిరి రాధాకృష్ణ,జిల్లా ప్రవీణ్,పుట్ట రాజు,బుడిగె మాహేష్,జిల్లా సంపత్,చింతమళ్ళ నరేష్, కోటగిరి నాగరాజు,పుట్ట సందీప్,పోతుల వెంకన్న,కుర్ర వీరయ్య,తాడ్వాయి సంపత్, కొప్పు సందీప్,యశ్వంత్, శివ,పరుషరాం,సంపత్,శంకర్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు*

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Streetbuzz news :నల్గొండ జిల్లా :

బిఎస్పి చిట్యాల మండల కమిటీ, నకిరేకల్ నియోజకవర్గ కమిటీ 

ఆధ్వర్యంలో, బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి, చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్పి జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు, జిల్లా ఇంచార్జి లు ఆదిమల్ల గోవర్ధర్, పంబాల అనిల్ మాట్లాడుతూ. ఛత్రపతి శివాజీ మహారాజ్, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతీ, యువకులు కుల మతాలకు ఆతీతంగా ఆదర్శంగా తీసుకోని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వేలాలని, తమ రోజువారి జీవితంలో దేశం పట్ల ధర్మం పట్ల శివాజీ స్పూర్తిని తీసుకొని ముందుకు సాగాలని నమనమాజ స్థాపన యొక్క గొప్పతనాన్ని, అవసరాన్ని ప్రతీ ఒక్కరికి తెలిపే విధంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసి మెంబెర్ గ్యార మారయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్షిరాం, జిల్లా మహిళా కన్వీనర్ పోకల ఎలిజబెత్, నియోజకవర్గ అధ్యక్షులు ఏరసాని జంగయ్య, నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్,చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతికుమార్, నకిరేకల్ మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్, రామన్నపేట కోశాధికారి రమేష్, గద్దపాటి రమేష్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ap :27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు* *రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు*

27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు

తొలుత రెండ్రోజుల పాటు సమావేశాలు

రెండో విడత మార్చి 6న ప్రారంభం

13 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

వెలగపూడి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అయితే ఈసారి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మొదటి రోజున గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ఉంటాయి. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా ప్రకటన ఉంటాయి. ఇక రెండో విడత సమావేశాలు మార్చి 6న ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే, అసెంబ్లీ సమావేశాలు రెండు విడతల్లో జరపనున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన ఎంపీపీ*

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన ఎంపీపీ

Streetbuzz news :నల్గొండ జిల్లా :

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మండల కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వం లో  ఎంపీపీ జెల్లా ముతిలింగయ్య కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కట్టంగూర్ మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేసి అనంతరం. ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య& మాజి జెడ్పిటిసి మాద యాదగిరి మాట్లాడుతూ.. భారతదేశంలో రైతాంగ ప్రజా వ్యతిరేక విధనాలకు పట్లుపడుతున్న మోడీ ప్రభుత్వానికి బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పే దిశగా బి అర్ ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అని అన్నారు దేశంలో బిజెపి పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని అరికట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం పాలన కొనసాగాలంటే బి ఆర్ ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వాన్ని సాధ్యమైద్దని దేశ ప్రజలు నమ్ముతూ స్వాగతిస్తున్నారు రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవుతారని అన్నారు దేశలో అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వములో బి ఆర్ ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతున్నారు అని అన్నారు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బి ఆర్ ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరడం ద్వారానే కెసిఆర్ భారతదేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని క్రియాశీలక శక్తులంతా ఏకమై దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని దేశ అభివృద్ధికి ముందుకు రావాలని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో సర్పంచులు చేనగాని సతీష్ రేణుక అయితేగొని నారాయణ,సుంకరబోయిన వెంకన్న,మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, మాజీ సర్పంచ్ గడుసు శంకర్ రెడ్డి,మాజీ రెపరండం సర్పంచ్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గద్దపాటి దానయ్య,ఎం ఎస్ ఆర్ చైర్మన్ మంగదుడ్ల శ్రీనివాస్, వనం రాంబాబు, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన కొండేటి మల్లయ్య*

నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన కొండేటి మల్లయ్య 

Streetbuzz news :నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలం గార్లబాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో తేలువారిగూడెం లో నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవస్థానం నిర్మాణం కోసం 50,000 రూపాయల విరాళం.అందజేసిన            

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య,ఈ కార్యక్రమంలో. నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరబోయిన నరసింహ్మ యాదవ్,మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమీరుద్దీన్,తేలు లింగయ్య,తేలు నాగయ్య తేలు భద్రయ్య,కడారి సైదులు,తేలు వెంకన్న,తేలు లింగయ్య,బొప్పని యాదగిరి,కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ మండల యువజన నాయకులు ఆవుల వేణు,తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ తరహా అభివవృద్ధి కోసం దేశ ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ల నుండి పుట్టిందే బీఆర్ఎస్. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే

ప్రజారంజక పాలకుడు కేసీఆర్

అలుపెరుగని పోరాట యోధుడు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహోన్నత వ్యక్తి

అనితర సాధ్యమైన విజయాలను తనదైన పద్దతుల్లో ప్రజలకు చేరువ చేసిన గొప్ప పరిపాలన దక్షకుడు

తెచ్చిన రాష్ట్రాన్ని దేశానికే తలమానికం గా తయారు చేసిన ఘనత కేసీఆర్ దే

సంక్షేమం - అభివృద్ధి ని సమపాళ్ళలో ముందుకు తీసుకెలుతూ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహా నేత

తెలంగాణ తరహా అభివవృద్ధి కోసం దేశ ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ల నుండి పుట్టిందే బీఆర్ఎస్

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Streetbuzz news :నల్గొండ జిల్లా :

నకిరేకల్ నియోజకవర్గం:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన సందర్భంగా శుక్రవారం నాడు నకిరేకల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు..మెదటగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి.. పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు బాణసంచా కాల్చిన, అనంతరం కేకు కట్ చేశారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వానికి దేశ వ్యాప్తంగా మద్దతు

-రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించచడం ఖాయం..

-ఉద్యమ వీరుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అలుపెరగని యోధుడు కారణజన్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా, ప్రజలకు అండగా మా గుండె నీ గుండెల్లో నిండిన ఇల్లు అని ప్రజల గుండెల్లో జనహృదయ నేతగా, రైతులకు రారాజుగా, రైతు బాంధవుడుగా, ఆసరా పింఛన్లతో అలుపెరగని నేతగా, తెలంగాణ రాష్ట్రమంతా నీటితో నింపి ప్రజల గుండెల్లో పోనిగి పొరులుతున నెలతల్లి గుండెలో అపరభగీరథుడిగా, భావి తెలంగాణ నిర్మాతగా, ఆడబిడ్డ కన్నీళ్లను తుడిచి కల్యాణ లక్ష్మీ తో కన్నతల్లితండ్రిగా,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

- ప్రజలతో నీరాజనాలు పొందిన మా తెలంగాణ జాతి పీత మా నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది అని,తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే తలమానికంగా పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా తమ రాష్ట్రంలో కేసీఆర్ లాంటి నేత తమకు పరిపాలకుడిగా ఉంటే తమ జన్మ ధన్యమని భావిస్తున్నారు. మాజీ ప్రధాని సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు .ఉద్యమ వీరుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అలుపెరగని యోధుడు కారణజన్ముడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాతగా, ప్రజలకు అండగా మా గుండె నీ గుండెల్లో నిండిన ఇల్లు అని ప్రజల గుండెల్లో జనహృదయ నేతగా, రైతులకు రారాజుగా, రైతు బాంధవుడుగా, ఆసరా పింఛన్లతో అలుపెరగని నేతగా, తెలంగాణ రాష్ట్రమంతా నీటితో నింపి ప్రజల గుండెల్లో పోనిగి పొరులుతున నెలతల్లి గుండెలో అపరభగీరథుడిగా, భావి తెలంగాణ నిర్మాతగా, ఆడబిడ్డ కన్నీళ్లను తుడిచి కల్యాణ లక్ష్మీ తో కన్నతల్లితండ్రిగా,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ఆయన అన్నారు.ప్రజలతో నీరాజనాలు పొందిన మా తెలంగాణ జాతి పీత మా నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుజర్ల శంబయ్య గారు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, యంపిటిసిలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు...

నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతుల ఆద్వర్యంలో గణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు.*

నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతుల ఆద్వర్యంలో గణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు.

Streetbuzz news :నల్గొండ జిల్లా :

వేడుకల్లో బాగంగా బిజీర్ సైన్యం యువత బారీబైక్ ర్యాలీ ఏర్పాటుచేయగ వారితోకలిసి మంగలపల్లి హైస్కూలులో ఉపాధ్యాయ మరియు విద్యార్ధి బృందంతో కలిసి కేకుకటింగ్ చేసి,మొక్కనునాటిన ఎంపీపీ దంపతులు, అనంతరం తాటికల్ వృద్ధాశ్రమంలో అవ్వతాతలతో కలిసి కేకుకటింగ్ చేపించి, వారికి అన్నధానంచేసి, పండ్లుపంపిణి చేశారు.

ఆశ్రమంలో అవ్వతాతలు ముఖ్యమంత్రి గురించి మాట్లాడినతీరు అందర్నీఆకట్టుకుంది, మా కన్నబిడ్డలు మమ్మల్ని పంటించుకోకున్న నేడు మా పెద్దకొడుకు కెసిఆర్ ఇచ్చె పెన్షన్ తో ఆశ్రమానికి నెలనెల ఫీజులు కట్టుకోని ప్రశాంతగా జీవిస్తునామని,మా ఆహిస్సు పోసుకోని మాపెద్దకోడుకు కెసిఆర్ పదికాలలపాటు చల్లగ వుండాలని వారు దీవించారు.

(ఈకార్యక్రమంలో)

వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,బీ ఆర్ ఎస్ నాయకులు మరియు బిజీర్ సైన్యం యువత భారీగ పాల్గొన్నారు.

*భారత్‌ బౌలింగ్‌.. తుది జట్టు ఇదే*

భారత్‌ బౌలింగ్‌.. తుది జట్టు ఇదే 

Streetbuzz news :

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్తు దిశగా టీమ్‌ఇండియా మరో సమరానికి సై అంటోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మరోసారి ఆసీస్‌ను చిత్తుచేసి.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఆడిన 24 టెస్టుల్లో భారత్‌ 20 టెస్టుల్లో గెలిచింది. నాలుగు డ్రా అయ్యయి. భారత్‌ తుది జట్టు: రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా, కోహ్లి, శ్రేయస్‌, జడేజా, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, అక్షర్‌, షమి, సిరాజ్‌.

ప్రమాదవశాత్తు డీసీఎం లో మంటలు*

ప్రమాదవశాత్తు డీసీఎం లో మంటలు              

*మాడుగులపల్లి :

మిర్యాలగూడ నుండి నల్గొండ వైపు వెళ్ళుతున్న డిసిఎం వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు చలరేగిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని కుక్కడం సమీపంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోతమిషన్ తీసుకొని వెళ్తున్న డీసీఎం వాహనము కుక్కడం సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమతమై కోత మిషన్ కిందికి దించాడు. కాగా డీసీఎం కు మాత్రం పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలు అర్పించే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.