సైకిల్ తొక్కండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ప్రకృతిని కాపాడండి పెద్దపళ్ల పీహెచ్సీ వైద్యులు డాక్టర్ భవాని శంకర్..
సైకిల్ తొక్కండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ప్రకృతిని కాపాడండి
పెద్దపళ్ల పీహెచ్సీ వైద్యులు డాక్టర్ భవాని శంకర్..
Streetbuzz news :
భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి నేతృత్వంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల పీహెచ్సీ పరిధిలో డాక్టర్ భవాని శంకర్ ఆధ్వర్యంలో సైకిల్ తొక్కండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొని ప్రకృతిని కాపాడండి అనే కార్యక్రమం ద్వారా మంగళవారం మండలంలోని పలు గ్రామాలలో ఏఎన్ఎం,ఆశ వర్కర్లు సహకారంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ పీవీ రమణారావు మాట్లాడుతూ శారీరక వ్యాయామంతో పాటు సైకిల్ తొక్కి ఆరోగ్యం,శారీర దృఢత్వం రక్షించుకోవాలని తెలియజేసి మోటార్ వాహనాలకు బదులుగా సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగు చెందడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిని కాపాడుకోవచ్చని ఆయన తెలియజేశారు.అనంతరం వైద్య ఆరోగ్య మేలా కార్యక్రమాలు నిర్వహించి మధుమేహం(షుగర్),అధిక రక్తపోటు (బిపి),సీజనల్ వ్యాధులు వంటి వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటరత్నం,హెల్త్ విజిటర్ ఉమా,హెల్త్ ఎగ్జిక్యూటర్,ఎంహెచ్ఎల్పిలు, ఏఎన్ఎం,ఆశ వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.*
Feb 15 2023, 09:18