madagoni surendar

Feb 13 2023, 20:45

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మరమ్మత్తు పనులకుగాను 9 లక్షలతో పూర్తి చేసిన ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమoలో. కట్టంగూర్ జడ్పీటీసీ తరాల బలరాం, ఎంపీటీసీలు,సర్పంచ్ లు,టీచర్లు, వార్డు నెంబర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 13 2023, 21:33

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షులుగా కట్టంగూర్ మండల కేంద్ర నికి చెందిన బసవోజు వినోద్*

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షులుగా కట్టంగూర్ మండల కేంద్ర నికి చెందిన బసవోజు వినోద్            

Streetbuzz news: నల్గొండ జిల్లా :

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షులుగా కట్టంగూర్ మండల కేంద్ర నికి చెందిన బసవోజు వినోద్ ను నియమించిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నూకల సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా బసవోజు వినోద్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో నన్ను బీజేవైఎం మండల అధ్యక్షులుగా నియమించినందుకు బీజేపీ జిల్లా కార్యదర్శి మండల. వెంకన్న కి,యువమోర్చ జిల్లా అధ్యక్షులు ఐతరాజు. సిద్దు కి, బీజేపీ జిల్లాకార్యవర్గ సభ్యులు పసుల సైదులు కి,మండల ప్రధాన కార్యదర్శి తండు. సైదులు కి పేరు పేరు అందరికి ధన్యవాదములుతెలిపారు.

madagoni surendar

Feb 13 2023, 09:50

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య   

Streetbuzz news.. నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణంలో రూ. 32 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు సోమవారం పరిశీలించారు పనుల్లో నాణ్యత లోపించకుండా పనులు చేయాలనీ నిర్ధేశిత గడువు లోపు హాస్పిటల్ పనులు పూర్తవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు .

కట్టంగూర్ మండల కేంద్రంలో ఈ నెల 18 వ తేదీన జరుగు శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఉమానాగ లింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం కరపత్రికను ఆవిష్కరించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 13 2023, 09:42

Water on Mars? : మార్స్‌‌పై నీటి జాడల ఆనవాళ్లు.. కనిపెట్టిన క్యూరియోసిటీ రోవర్

Water on Mars? : మార్స్‌‌పై నీటి జాడల ఆనవాళ్లు.. కనిపెట్టిన క్యూరియోసిటీ రోవర్

Water on Mars? : మార్స్‌పై నీరు ఉందా లేదా అనే అంశంపై ఏళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రహస్యాన్ని బట్టబయలు చేసేందుకు ఆ గ్రహంపైకి వెళ్లిన క్యూరియోసిటీ రోవర్.. ఓ ఆసక్తికరమైన విషయం తెలిపింది. అదేంటో తెలుసుకుందాం. (All Images Credit - NASA)

అంగారక గ్రహం (Mars)పై నీరు ఉండి ఉంటే... ఈపాటికి ఈ భూమిపై ఉన్న ధనవంతుల్లో చాలా మంది మార్స్ ట్రిప్స్ వేసి వచ్చేవారే. కానీ ఆ నీరే ఊరిస్తోంది. ఉన్నట్లు కనిపిస్తూ.. ఎక్కడుందో తెలియట్లేదు. మార్స్ గ్రహ ఉపరితలంపై తిరుగుతూ ఉన్న క్యూరియోసిటీ రోవర్ (Curiosity Rover).. ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నీటి జాడల ఆనవాళ్లను గుర్తించింది

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. తాజాగా ఓ ట్వీట్ చేసింది. దాని ప్రకారం క్యూరియోసిటీ రోవర్.. ఇప్పుడు ఉన్న ప్రదేశంలో.. ఒకప్పుడు ఓ సరస్సు ఉండేది. అది ఎండిపోయింది. ఆ సరస్సు ఉండేది అని గుర్తించేందుకు వీలుగా అక్కడి నేల ఉంది. అందుకు సంబంధించి క్యూరియోసిటీ తీసిన ఫొటోను నాసా రిలీజ్ చేసింది.

ప్రస్తుతం క్యూరియోసిటీ తిరుగుతున్న ప్రదేశాన్ని సల్ఫేట్-బేరింగ్ యూనిట్ అని పిలుస్తున్నారు. ఇదివరకు శాస్త్రవేత్తలు ఆ ప్రదేశాన్ని పొడి ప్రదేశంగా భావించారు. అక్కడ ఏ సరస్సూ లేదు అనుకున్నారు. కానీ కొత్త ఫొటోని బట్టీ... అక్కడ సరస్సు ఉండేది అని అత్యంత స్పష్టంగా తేలింది. మరైతే.. ఆ ద్రవం ఏమైంది? ఎటుపోయింది?

ఈ సల్ఫేట్ బేరింగ్ యూనిట్ ప్రదేశం.. షార్ప్ (Mt.Sharp) అనే ఎత్తైన పర్వతానికి దగ్గర్లో ఉంది. ఇదివరకు ఈ పర్వతాన్ని ఎక్కిన క్యూరియోసిటీ రోవర్... అక్కడి నుంచి దిగువ ప్రదేశాన్ని చూసింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి పంపినదే తాజా ఫొటో. ఇప్పుడు మీరు చూస్తున్నవి.. ఆ ఫొటోలో భాగమే.

మేము ఈ మొత్తం పరిశోధనలో చూసిన నీటి, అలలకు సంబంధించిన ఉత్తమ సాక్ష్యం ఇది" అని క్యూరియోసిటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అశ్విన్ వాసవాడ తెలిపారు. అశ్విన్.. కాలిఫోర్నియాలోని పసడేనాలో ఉన్నా, నాసాకి చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. "ఇప్పటివరకూ మేము క్యూరియోసిటీని వేల అడుగులు ఎక్కించాము. ఎక్కడా ఇలాంటి సాక్ష్యాన్ని చూడలేదు" అని అశ్విన్ తెలిపారు.

వందల కోట్ల సంవత్సరాల కిందట.. ఆ ప్రదేశంలో తక్కువ నీటితో ఓ సరస్సు ఉండేది. సరస్సు అడుగు భాగంలో సున్నపురాయి.. మెత్తగా మారింది. ఆ రాతికి.. నీటి అలలు కంటిన్యూగా తగిలేవి. తద్వారా అలలు వచ్చినట్లుగా ఆకారం ఏర్పడింది" అని నాసా (NASA) తెలిపింది.

అలల లాగా కనిపిస్తున్న ప్రదేశానికి ఇప్పుడు మార్కర్ బ్యాండ్ అని నిక్‌నేమ్ పెట్టారు. అక్కడ ఓ రకమైన నల్లటి రాయి ఉంది. అది మిగతా షార్ప్ పర్వత రాయికి భిన్నంగా ఉంది. తన పరిశోధనలో క్యూరియోసిటీ రోవర్.. కొన్ని రాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించింది. ఇందుకోసం డ్రిల్లింగ్ చేసింది. ఆ డ్రిల్లింగ్‌ని బట్టీ ఆ రాళ్లన్నీ గట్టిగానే ఉన్నట్లు నాసా గుర్తించింది.

2014 నుంచి క్యూరియోసిటీ రోవర్.. 5 కిలోమీటర్ల ఎత్తున్న షార్ప్ పర్వతానికి దగ్గర్లో తిరుగుతోంది. ఒకప్పుడు ఈ పర్వతం దగ్గర సరస్సులు, నీటి ప్రవాహాలు ఉండేవి అని భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడ జీవులు జీవించాయా అనే అంశాన్ని పరిశోధిస్తున్నారు. ఐతే.. అప్పట్లో ఉండే నీరు.. ఆ తర్వాత ఏమైపోయింది? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు.

madagoni surendar

Feb 12 2023, 14:49

తప్పిపోయిన ముస్లిం మహిళకు మానవత్వంతో ఆర్థిక సహాయం చేసిన మున్సిపల్ చైర్మన్,రోష్ని ట్రస్ట్....*

తప్పిపోయిన ముస్లిం మహిళకు మానవత్వంతో ఆర్థిక సహాయం చేసిన మున్సిపల్ చైర్మన్,రోష్ని ట్రస్ట్....

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మహె రున్నిసా బేగం (48) మతిస్థిమితంతో తప్పి పోయి కేరళ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా.. ఆమెను రప్పించడానికి కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని విశ్వేశ్వర్ గారితో పాటు రోష్ని ట్రస్ట్ అధ్యక్షులు న్యాయవాది అలీంలు మానవత్వం చూపి 4వేలు ఆర్థిక సాయం చేయగా.. కొత్త కోట మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి 2వేల రూపాయలు,కొత్తకోట వైస్ ఎంపిపి వడ్డే శ్రీనివాసులు ఒక వెయ్యి రూపాయలు,పాలెం గ్రామ సర్పంచ్ రామకృష్ణారెడ్డి వెయ్యి రూపాయలు,పాలెం గ్రామ మాజీ ఎంపిటిసి సాయి దాభ రాజు మరో రెండు వేల రూపాయలు అందించి బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్,కో ఆప్షన్ సభ్యులు వసీం ఖాన్, తహెసీన్ వహీద్ అలీ,క్రషర్ మాధవరెడ్డి,వినోద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా కేరళలో ఉన్న మా అక్క మహేరున్నీసా బేగంకు కొత్తకోటకు రావడానికి ఆర్థిక సహాయం చేసి.. అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి మార్గం సుగమం చేసిన కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ గారికి,రోష్ని ట్రస్ట్ అధ్యక్షులు న్యాయవాది అలీo గారికి మెడికల్ ఖాజా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

madagoni surendar

Feb 11 2023, 20:47

భద్రాద్రిలో అరుణ్ సాగర్ పురస్కారాలు.

భద్రాద్రిలో అరుణ్ సాగర్ పురస్కారాలు 

భద్రాద్రి కొత్తగూడెం : ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పేరిట ప్రతీ సంవత్సరం ఇచ్చే పురస్కారాలను భద్రాచలంలోని శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ నందు అరుణ్ సాగర్ పురస్కారాల సభ ముస్తాబయింది.

ఈ సంవత్సరం అరుణ్ సాగర్ పురస్కార జ్ఞాపికలను ప్రముఖ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అందించనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీన ఉదయం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నందు పురస్కార సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అవార్డుల ప్రధానం ఉంటుందని తెలిపారు. అరుణ్ సాగర్ పురస్కారాల సభకు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో, విశిష్ట అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, సాక్షి పత్రిక సంపాదకులు వద్దెల్లి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. కవులకు, రచయితలకు, జర్నలిస్టులకు వేదికగా జరుగుతున్న ప్రముఖ కవి, జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పురస్కారాల సభకు అభిమానులు కవులు జర్నలిస్టులు సంఘ సంస్కర్తలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

madagoni surendar

Feb 11 2023, 17:33

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.

2 ఫైర్ ఇంజన్లు తో మంటలని అదుపు లోకిస్తున్న అగ్నిమాపక శాఖ ...

ఈరోజు రెండో శనివారం కార్యాలయానికి సెలవుకావడంతో సిబ్బంది ఎవరూ లేరు....

ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఏ ఫైళ్లు దగ్ధం అయ్యాయి, ఎంతవరకు నష్టం కలిగిందని అనే అంశాలు తెలియాల్సి ఉంది....

కొసుమెరుపు*

ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో రెండుసార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం అవ్వగా నేడు జరిగిన అగ్నిప్రమాదం లో ఏమి ఫైల్ తగలబడ్డాయో,ఏమి నష్టం జరిగిందో విచారణలో తెలియాల్సి ఉంది...

madagoni surendar

Feb 11 2023, 17:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయండి.

ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఫలుమార్లు స్పష్టం చేసింది.

నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా అమరావతిని రాజధానిగా అంగీకరించారు.

ఏపీ హైకోర్టు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చింది.

3 రాజధానుల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ప్రతి నెల ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం 3 రాజధానులంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

అమరావతి రాజధాని విషయంలో ఇకనైనా వివాదాలకు స్వస్తి పలకండి.

- రామకృష్ణ.

madagoni surendar

Feb 11 2023, 11:24

వైద్య సేవలు రోగుల హక్కులు.. యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్.

వైద్య సేవలు రోగుల హక్కులు..

యంగలి గోపి గౌడ్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్,

ది నేషనల్ కన్సుమర్ రైట్స్ కమీషన్. 

నల్గొండ జిల్లా :

సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగ దారులే అందరూ తమ అవసరాల కోసం అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ధరలలో తేడాలు, కల్తీ, తూనికలు, కొలతలలో మోసాలు వంటివెన్నో జరుగుతుంటాయి వినియోగదారులకు చట్ట పరిజ్ఞానం లేనందు వల్ల నష్టపోతుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పొందే సేవల్లో లోపం ఉంటే వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులకు వర్తించదు కానీ వైద్యంలో నిర్లక్ష్యం చూపితే డాక్టర్‌పై సివిల్‌ కోర్టులో కేసు నమోదు చేసుకోవచ్చు.

రోగానికి సంబంధించిన సమాచారం కోరొచ్చు. మందుల పట్టికకు సంబంధించిత సమాచారం చికిత్సకు సంబంధించిన వివరాలను పొందే హక్కు ఉంటుంది 

మార్కెట్‌ నుంచి ఏ వస్తువునైనా కొనేటప్పుడు ఐఎస్‌టీ, అగ్‌మార్క్‌ ముద్ర ఉన్న వస్తువులనే కొనాలి. కల్తీ జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. ఫోరాల పరిధిలోకి వచ్చే వివాదాలు, అంశాలు వస్తు సేవల నాణ్యతా ప్రమాణాలలో లోపాలు, వ్యత్యాసాలు, తేడాలు వస్తు, సేవల ప్యాకేజీల ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు బస్డాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌, సినిమా హాళ్లలోనూ వస్తు, సేవల ప్యాకేజీ మీద ముద్రించిన రేటుకే అమ్మాలని చట్టం శాసిస్తోంది. అలా కాకుండా అధిక ధరలకు అమ్మితే బాధిత వినియోగదారుడు తూనికల, కొలతల శాఖవారి టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800-425-333కి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసి న్యాయాన్ని పొందొచ్చు ఆ ఫిర్యాదును వారం రోజలలోపు విచారించి పరిష్కరిస్తుంది.

madagoni surendar

Feb 11 2023, 08:45

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన.

 Street Buzz news నల్గొండ జిల్లా:

 ;(నకిరేకల్):- విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ, NSUI విద్యార్థి సంఘాల నాయకులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ మైనార్టీ స్కూల్ ను కట్టంగూర్ కు తరలించొద్దని ఆ పాఠశాల అద్దె భవనంలో మగ్గుతోందని వెంటనే సొంత భవనం నిర్మించాలని డిగ్రీ, బీసీ గురుకుల.మైనార్టీ గురుకుల పాలిటెక్ని, ఐటిఐ కళాశాలను నకరేకల్ లో నిర్మించాలని డిమాండ్ చేశారు,లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ లోని విద్యారంగా సమస్యలు ఏం పరిష్కరించిండు నకిరేకల్ నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేసిండు కనిపించట్లేవా అని ప్రశ్నించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ నాయకుడు గద్దపాటి రమేష్, నియోజకవర్గ కోశాధికారి కొవ్వూరి రంజిత్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత, విజయ్, సందుపట్ల శృతి విద్యార్థి యూనియన్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.