TeluguCentralnews

Oct 22 2021, 09:36

చైనా బొమ్మలపై ప్రమాదకర రసాయనాలు కోటింగ్

 

​ 
కొన్ని మేడ్​-ఇన్​-చైనా బొమ్మలపై(made in china toys) ప్రమాదకర రసాయనాలు కోటింగ్​ చేసినట్టు అమెరికా అధికారులు గుర్తించారు(us china news). అనంతరం వాటిని జప్తు చేశారు. కాగా.. ఈ తరహా బొమ్మలు భారత్​లోనూ ఎక్కువగా లభిస్తుండటం, పిల్లల కోసం తల్లిదండ్రులు వాటిని అధికంగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం(india china news).
అమెరికాలోని వాషింగ్టన్​లో మేడ్​-ఇన్​-చైనా బొమ్మలను(made in china toys) అధికారులు సీజ్​ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్​ చేసినట్టు గుర్తించామని వివరించారు(us china news). ఇలాంటి బొమ్మలు భారత్​లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం(india china news).

ఈ నేపథ్యంలో హాలీడే సీజన్​లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్​లైన్​లో కొనుగోలు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని యూఎస్​ సీబీపీ(కస్టమ్స్​ అండ్​ బార్డర్​ ప్రొటక్షన్​) హెచ్చరించింది. బొమ్మలను భారీ మొత్తంలోని లీడ్​, కాడ్​మియమ్​, బేరియమ్​ కోటింగ్​లు కనపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బొమ్మలను ఈ ఏడాది జులై 16న సీబీపీ అధికారులు, సీపీఎస్​సీ(కన్జ్యూమర్​ ప్రోడక్ట్స్​ సేఫ్టీ కమిషన్​) తనిఖీలు చేశారు. మొత్తం 7 బాక్సుల్లో చైనా నుంచి బొమ్మలు వచ్చాయి. వీటిల్లో చాలా వరకు భారత దేశంలోనూ అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఆగస్టు 24న బొమ్మలను ల్యాబ్​కు పంపించారు. అక్కడే బొమ్మల్లో ప్రమాదకర రసాయనాల కోటింగ్​ విషయం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్​ 4న వాటిని అధికారులు సీజ్​ చేశారు. 

TeluguCentralnews

Oct 22 2021, 08:46

బంధాలు భారమై'పోయా'యా:

 


      మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు. వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి. ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు. ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు. ఇల్లంతా వెతికినా కనిపించవు. అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు.  కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు. ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు. 

 

     రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది. ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి. ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది. ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది. డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది. ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ, అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు.  డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు. 

     ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు. మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది. ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము. మనుషుల మధ్య ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది. 

   సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు.  వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు. 

 

      అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి. చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు! అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే అమృతం లాంటిది.

        కొందరికి తల్లితండ్రులను పలకరించే తీరికలేని సంపాదనలో ఉన్నారు. అది చాలా దుర్భరమైన స్థితి.

 ఆలోచించండి బంధాలను బలపరుచుకోండి 

TeluguCentralnews

Oct 20 2021, 13:34

క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై నేడు తీర్పు

 


ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. అంతకుముందు, అక్టోబర్ 14 న జరిగిన విచారణలో, న్యాయమూర్తి వివి పాటిల్ కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దసరా మరియు వారాంతాల్లో అక్టోబర్ 20 న ఉత్తర్వులను ప్రకటించనున్నట్లు కోర్టు ప్రకటించింది.

 

బాలీవుడ్ నటుడు షారూఖ్ 23 ఏళ్ల కుమారుడు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3 న ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్‌పై జరిగిన రేవ్ పార్టీ రైడ్‌లో ఎన్‌సిబి అరెస్టు చేశారు. దీని తరువాత, అక్టోబర్ 7 న, కోర్టు ఆర్యన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అతను ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు.

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో 20 మంది అరెస్ట్
ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ కాకుండా, మరో ఏడుగురు నిందితులను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో విదేశీయులతో సహా మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. గతంలో కోర్టులో విచారణ సందర్భంగా, ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది సతీష్ మన్షిండే వాదించారు, ఈ hisషధం తన క్లయింట్ నుండి రికవరీ చేయబడలేదు లేదా అతను డ్రగ్స్ అమ్మడం మరియు కొనడంలో పాలుపంచుకోలేదు కాబట్టి, అతనికి బెయిల్ మంజూరు చేయాలి. వాట్సాప్ చాట్ చూడటం ద్వారా డ్రగ్ నెక్సస్‌లో ఆర్యన్ ప్రమేయం వెలుగులోకి వచ్చిందని ఎన్‌సిబి పేర్కొంది.

 

అదే సమయంలో, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌లో, అతని న్యాయవాది అతను "నిర్దోషి అని మరియు నేరం చేయలేదని చెప్పాడు. ఆర్యన్ ఖాన్ నుండి ఎలాంటి రికవరీ జరగలేదని అంగీకరించబడిన స్థానం అని పిటిషన్‌లో పేర్కొనబడింది. NCB లు అతని వద్ద ఎలాంటి అభ్యంతరకరమైన విషయాలు లేవు.

ఆర్యన్ చాలా సంవత్సరాలుగా నిషేధిత drugsషధాలను వినియోగిస్తున్నాడు
మరోవైపు, ఆర్యన్ ఖాన్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ని NCB వ్యతిరేకించింది, అతను డ్రగ్స్ వినియోగించాడని మరియు వాట్సాప్ చాట్‌ల ఆధారంగా "అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్" లో భాగమని పేర్కొన్నాడు. ఆర్యన్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ వ్యాపారం చేసేవాడని, అతని ఫోన్ నుండి రికవరీ చేసిన చాట్‌లలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని NCB తెలిపింది. అదే సమయంలో, అంతకు ముందు, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో, NCB కోర్టుకు చెప్పింది, అలాంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఆర్యన్ చాలా సంవత్సరాలుగా నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నాడని తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు, అతను ఇతర దేశాలలో డ్రగ్స్ కూడా తీసుకున్నాడు. 

TeluguCentralnews

Oct 20 2021, 13:31

ఉత్తరాఖండ్‌లో బీభత్సం సృష్టిస్తోన్న భారీ వర్షాలు 42 మంది మృతి 

 


భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిపోవడంతో దాదాపు 42 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
 
 నైనిటాల్‌లో 27 మంది, అల్మోరాలో తొమ్మిది మంది, చంపావత్, పితోర్‌గఢ్, బాగేశ్వర్ మరియు ఉద్ధమ్ సింగ్ నగర్‌లో ఒక్కొక్కరు మరణించారు. మొత్తంగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా 42 మంది మరణించారు. 

 ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం, రుద్రపూర్ ప్రాంతంలో నీటి ఎద్దడి వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.

 

  ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ .4 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్న ప్రజలకు, కొండ ప్రాంతాల్లో ఒక లక్ష తొమ్మిది వేలు, మైదాన ప్రాంతాల్లో 95 వేలు ఇస్తామని చెప్పారు. 

ఈ రోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గురువారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

 నైనిటాల్‌లోని ఖైర్నాలో రహదారి మూసివేత కారణంగా బుధవారం ఉదయం నుండి 500 మంది చిక్కుకుపోయారు. వారికి సైన్యం ద్వారా ఆహార పదార్థాలు అందిస్తున్నారు.

 ఆర్మీ సిబ్బంది ఖైర్నాలో సహాయక చర్యలు చేపట్టారు బాధితులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. 

TeluguCentralnews

Oct 19 2021, 11:36

ముంచెత్తిన వరదలు.. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వణుకుతున్న ఉత్తరాఖండ్‌, కేరళ..!

 


భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్‌ను ముంచెత్తాయి. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..జనావాసాల్లోకి ఒక్కసారిగా పోటెత్తింది వరదనీరు. దీంతో వరదలో చిక్కుకున్న వారు ఒడ్డుకు చేరేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వరద ఉధృతికి బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. చంపావత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్‌..వరద ఉధృతికి కూలిపోయింది. వరద ప్రవాహానికి పలు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ఓ కారును తీవ్రంగా శ్రమించి క్రేన్‌ సాయంతో బయటకు తీశారు రెస్క్యూ టీమ్‌. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

 

వర్షాలు, వరదల ధాటికి కేరళలో మృతుల సంఖ్య 38కి చేరింది. కొట్టాయం జిల్లా కూట్టిక్కల్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వరదలకు నలుగురు చిన్నారులతో సహా ఓ కుటుంబమంతా జలసమాధి అయిపోయింది. 10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

అయితే ఇంత వరదలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోలేదు ఓ జంట. చుట్టూ నీరున్నా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చొని అతికష్టంమీద ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. చివరికి పెళ్లి మంట‌పం సైతం నీటితో నిండిపోయింది. అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి ప‌రిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి స‌మ‌క్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు. 

TeluguCentralnews

Oct 19 2021, 11:16

T20 World Cup: ఓపెనర్లపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ.. వారిద్దరే ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని వెల్లడి..!

 టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ 24న పాకిస్తాన్‎తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‎కు పెద్ద సందేహం తలెత్తింది. అదేమిటంటే టాప్ ఆర్డర్ ఎలా ఉంటుందని. రోహిత్ శర్మ ఒక ఓపెనర్‎గా వస్తాడని తెలుసు కానీ మరో ఓపెనర్ ఎవరు అని క్రికెట్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. రెండో ఓపెనర్ కోసం ప్రధాన పోటీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, KL రాహుల్ మధ్య ఉంది. జట్టులో శిఖర్ ధావన్ లేనందున రోహిత్ తన ప్రారంభ భాగస్వామిగా కోహ్లీని ఎన్నుకుంటాడని, రాహుల్ మూడో స్థానంలో వస్తాడని అనుకుంటున్నారు. అయితే దుబాయ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన భారత తొలి వార్మప్ గేమ్ టాస్‌ సమయంలో ఈ విషయమై కోహ్లీ స్పష్టతనిచ్చాడు. ఐపీఎల్ 2021లో జరిగిన తర్వాత తమ ప్రణాళికలో మార్పు వచ్చింది. “ఐపీఎల్ కంటే ముందు పరిస్థితులు భిన్నంగా ఉండేవి, ఇప్పుడు కెఎల్ రాహుల్‌ ఫామ్‎లో ఉన్నాడు. రోహిత్, రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. తను మూడో స్థానంలో బ్యాటింగ్‎కు వస్తానని కోహ్లీ చెప్పాడు.

 

మార్చిలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన హోమ్ సిరీస్‌లో కోహ్లీ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 626 పరుగులతో రాణించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానంలో నిలిచాడు. టోర్నమెంట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ పరంగా తాను ఎక్కువ ఆలోచిస్తున్నామని, “ఇప్పుడు ఈ జట్టుకు త్వరగా అలవాటు పడటంతోపాటు ఎవరు ఎక్కడ ఆడుతారు అనేది ముఖ్యం. ఆటలలో అబ్బాయిలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. వీలైనంత ఎక్కువ మందికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాం ” విరాట్ చెప్పారు. సోమవారం తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 

TeluguCentralnews

Oct 19 2021, 10:24

రైతులకు కేంద్రం వరం..!

 


దేశంలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు పెద్ద ఉపశమనం కల్పిస్తూ యూరియాపై సబ్సిడీని పెంచింది. కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఎరువుల ధరలు పెరుగుతున్నాయని రైతుల డిమాండ్‌ను నెరవేర్చడానికి ప్రభుత్వం బయటి నుంచి వివిధ రకాల ఎరువులను దిగుమతి చేసుకోవాల్సి ఉందని వివరించారు.

 

యూరియాపై సబ్సిడీ రూ.2000 పెరిగింది
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడానికి బదులు సబ్సిడీని పెంచిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండాలని, వారికి లాభాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. యూరియాపై సబ్సిడీని ఒక్కో బ్యాగ్‌పై రూ.1500 నుంచి రూ.2000 కి పెంచినట్లు మంత్రి చెప్పారు.


28 వేల కోట్లు రైతులకు సబ్సిడీగా ఇచ్చారు
యూరియా కాకుండా కేంద్ర ప్రభుత్వం డీఏపీపై ఇచ్చే సబ్సిడీని రూ.1200 నుంచి రూ.1650కి పెంచింది. అలాగే ఎన్‌పికెపై కూడా సబ్సిడీ పెంచింది. ఈ రబీ సీజన్‌లో రైతులకు ఇచ్చే ఎరువులపై సబ్సిడీగా మొత్తం 28 వేల కోట్ల రూపాయలు ప్రధాన మంత్రి ఖర్చు చేశారని కేంద్ర మంత్రి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నాయి..
ఖరీఫ్ పంటల కోత తర్వాత రైతులు ఇప్పుడు రబీ పంటలు వేస్తున్నారు. ఇంతలో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఎరువుల కొరత గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ధరలు పెరగడం వల్ల ఎరువుల దిగుమతులు తగ్గాయి. భారతదేశంలో దిగుమతి చేసుకున్న DAP ధర ఈసారి టన్నుకు $ 675 నుంచి $ 680కి చేరుకుంది. 

TeluguCentralnews

Oct 18 2021, 16:17

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారని వస్తున్న వార్తలు అవాస్తవం ఆయన క్షేమంగా ఉన్నారు 

TeluguCentralnews

Oct 18 2021, 12:59

నదిలో కొట్టుకుపోయిన రెండంతస్తుల భవనం

 


కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. 

 

కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్​లో నది ఉప్పొంగి.. రెండంతస్తుల భవనం కొట్టుకుపోయింది. అంతా చూస్తుండగానే.. భవనాన్ని వరద తనలో కలిపేసుకుంది. 

అప్పటికే అందులో ఉండే కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించటం వల్ల ప్రమాదం తప్పింది. 

TeluguCentralnews

Oct 18 2021, 10:13

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 200 మంది కార్మికులు

 


సూరత్‌: గుజరాత్‌లోని సూరత్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో 200 మంది కార్మికులు పరిశ్రమలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.