Andrapradesh

May 08 2021, 10:18

విజయనగరం బ్రేకింగ్
 


కలెక్టర్ హరి జవహర్ లాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బి.సి.వెల్ఫేర్ సూపరెండింట్ లల్లి

తన చిన్న కుమారుడు కోవిడ్ తోబాధపడుతున్నాడని..ఏదైనా సహాయం చేయగలరని కలెక్టర్ ని కోరిన సూపరెండింట్ లల్లి

నేనేమి చేయలేను అంటూ కలెక్టర్ హరి జవహర్ లాల్ చేతులెత్తేసారని బాధితరాలు ఆవేదన

ఆక్సిజన్ అందట్లేదని చెప్పినా కలెక్టర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన బి.సి.వెల్ఫేర్ సూపరెండింట్ లల్లి

ఆక్సిజన్ అందక మధ్యాహ్నం 2 గం.లకు మృతి చెందిన లల్లి చిన్న కుమారుడు(32)

పేదోడికి విలువ లేదని, పేద వాళ్లను కలెక్టర్ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమైన బాధితురాలు

జిల్లాలో కోవిడ్ బారిన పడి సరైన చికిత్స అందించలేని కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరిన సూపరెండింట్ లల్లి

Andrapradesh

May 07 2021, 16:02

సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదు... - హైకోర్టు 
 


 అమరావతి 

  సంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ స్వాధీనంపై జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల న్యాయవాదులు కోరారు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు సీఐడీ అధికారులు వెల్లడించారు. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టునే విచారణ చేయమని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ సమాచారాన్ని.. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్లు కోర్టుకి తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 17కు వాయిదా వేసింది.

Andrapradesh

May 07 2021, 12:34

తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు
 


విజయవాడ సిపి కార్యాలయం

  విజయవాడ GGHలో ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ భాదితులు...

   18టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో తెగిపోయిన సంబంధాలు...

  విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు.

  హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసిన సి‌పి.

  ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని గుర్తించిన ప్రత్తిపాడు పోలీసులు.

  నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు.

  డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ప్రత్తిపాడు సిఐ...అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు...

  డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చిన పోలీసులు.

Andrapradesh

May 07 2021, 08:09

బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు..అల్లూరి సీతారామరాజు 
 


భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 7)ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

వంశం

సీతారామరాజు ఇంటిపేరు [అల్లూరి]]. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా]] నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు -- వెంకట కృష్ణంరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృష్ణంరాజు, అతని పెదతండ్రి వెంకట నరసింహరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచంద్రరాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు.

అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న పాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె (ఆమె భర్త దంతులూరి వెంకటరాజు), సత్యనారాయణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నారు.

అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూఢా "శ్రీరామరాజు" "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసు కున్నాడు ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని.

 • Andrapradesh
   @Andrapradesh ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాధ 
Andrapradesh

May 07 2021, 07:59

రాష్ట్రంలో కోవిడ్ రెడ్ జోన్ లో 5 జిల్లాలు
 


గుంటూరు
చిత్తూరు
అనంతపురం
కర్నూలు
శ్రీకాకుళం 

వీటిలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో గుంటూరు జిల్లా. 25రోజుల్లో 17వేలకు పైగా కోవిడ్ కేసుల నమోదు.

Andrapradesh

May 06 2021, 19:01

ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు ఉచిత చికిత్స : సీఎం జగన్
 అమరావతి :

 కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని సూచించారు. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా, తప్పనిసరిగా చేర్చుకోవాలని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ ఆ బెడ్లను ఇవ్వాలని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని సూచించారు.

Andrapradesh

May 06 2021, 18:59

కోవాగ్జీన్ వ్యాక్సిన్ సరఫరా లేక అవస్థలు.
 


గుంటూరు జిల్లాలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్న వారి పరిస్ఠితి ఆగమ్యగొచరంగ తయారైంది.        

రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకునేందుకు గడువు ముగిసిపోతున్నా కూడా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఉండే నిర్వాహకులు నుంచి స్పందన కరువైంది. 

కోవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం ప్రతిరోజు ఆయా కేంద్రాల వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. అక్కడ వారికి సరైన సదుపాయాలు లేక పోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. 

ఎండవేడిమి తట్టుకోలేక సమీపంలోనే చెట్ల వద్దకు, అరుగులు ను ఆశ్రయిస్తున్నారు.   

మొదటి దశలో వ్యాక్సిన్ ను అధిక శాతం మంది వృద్ధులు  వేయించుకున్న విషయం గమనించాలి.       

రెండో డోసు వ్యాక్సిన్ కోసం ప్రతిరోజు వ్యాక్సిన్ కేంద్రాలకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు.    

అదిగాక కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ వారు గనుక వైరస్ బారిన పడితే మరో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.    

కావున జిల్లా వైద్య అధికారులు,కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి రెండవ డోసు వేయించుకోని వారికి అవకాశం కల్పించాలని వారి నుంచి ప్రత్యేకంగా వస్తున్న డిమాండ్....

Andrapradesh

May 06 2021, 18:17

కరోనా వ్యాక్సినేషన్ పై ఈ నెల 8న నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు
 


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీకాలు వేయండి... ప్రాణాలు కాపాడండి అనే నినాదాలతో నిరసనలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలో కరోనా అధికంగా ఉన్న 33 జిల్లాల్లో 7 జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ తప్ప కరోనా నియంత్రణకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం 13 లక్షల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చిందని ఆరోపించారు. అటు, చంద్రన్న బీమా ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు వచ్చేవని తెలిపారు.

Andrapradesh

May 06 2021, 18:12

ఏపీలో ఆరు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు
 


అమరావతి: ఏపీలో పలు ఆస్పత్రులపై అధికారులు మెరుపు దాడులు చేశారు. 30 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆరు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కడపలోని ఓ ఆస్పత్రి గుర్తింపు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ మంది రోగులను చేర్చుకోవడం, ఆరోగ్యశ్రీ చికిత్స నిరాకరణ, రెమ్‌డెసివిర్‌ దుర్వినియోగంపై చర్యలు చేపట్టారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ షాపుల్లో రికార్డులు నిర్వహించకపోవడం వంటి అవకతవకలపైనా కేసులు నమోదు చేశారు. ప్రకృతి వైఫరీత్యాల చట్టం, ఔషధ నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. 
ఆరు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు
పిడుగురాళ్లలోని పల్నాడు ఆస్పత్రి, అంజిరెడ్డి ఆస్పత్రి
చిత్తూరులోని సుభాషిణి ఆస్పత్రి
విజయవాడలోని వేదాంత ఆస్పత్రి..
శ్రీకాకుళంలోని సూర్యముఖి ఆస్పత్రి
కడపలోని సిటీ కేర్‌ ఆస్పత్రికి కొవిడ్‌ పేషెంట్లను చేర్చుకునే అనుమతి రద్దు

Andrapradesh

May 06 2021, 15:48

ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
 


ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి... అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్లు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు నోడల్ అధికారులు 24×7 ఉండాలని... ఎక్కువ టెస్టులు చేసేలా సౌకర్యాలు పెంచాలి అని తెలిపింది. అలహీ వ్యాక్సినేషన్ పై ఆరా తీసిన హైకోర్టు... 45 ఏళ్ల లోపు వారికి ఎపుడు వ్యాక్సిన్ వేస్తారని... అందరికి వ్యాక్సిన్ వేయటంలో ఇబ్బందులు ఏంటన్న కోర్టు తదుపరి విచారణ వెకేషన్ బెంచ్ కోర్టుకు వాయిదా వేసింది