కొండా సురేఖ పై అధిష్టానం సీరియస్!
తెలంగాణ మంత్రి కొండ సురేఖ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రముఖ హీరోయిన్ సమంత పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తున్నాయి.
కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఇరకాటంలో పెట్టాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని, నాగార్జున నాగచైతన్య సమంత పైన కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి తెచ్చారని దీనికి సమంతా అంగీకరించకపోవడంతో నాగచైతన్య విడాకులు ఇచ్చాడని మంత్రి కొండా సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖ రాజీనామాకు డిమాండ్
ఈ ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడే కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె తీరు పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థి పార్టీల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఒక బాధ్యతయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలను ఎటువైపు తీసుకు వెళుతుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయాలలో దిగజారుడుతనాన్ని ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండ సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె పైన వ్యతిరేకత వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి సైతం కొండా సురేఖ యొక్క అనుచిత వైఖరి పట్ల ఫిర్యాదులు వెల్లువగా మారాయి. ఇక నాగ చైతన్య, నాగార్జున, సమంత అభిమానులు కొండా సురేఖను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు.
దసరాకు ముందే మంత్రి వర్గ విస్తరణ
కొండ సురేఖ తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు ఒక వ్యక్తిగా ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండ సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న సమయంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో కొండా సురేఖపట్ల ఒక్కసారిగా వ్యక్తం అవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండా సురేఖ తీరు పైన అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. సొంత పార్టీలో కూడా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.
కొండా సురేఖ మంత్రి పదవికి ఉద్వాసన?
ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు. నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండ సురేఖ కు ఉద్వాసన పలికే ఆలోచనలో కూడా అధిష్టానం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది . మరోవైపున కొండ సురేఖ వ్యాఖ్యల పైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? సురేఖ మంత్రి పదవి విషయంలో సీరియస్ స్టెప్ తీసుకుంటుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది..
Oct 03 2024, 13:22