కోర్ అర్బన్ రీజియన్ పరిరక్షణ హైడ్రాకే: దానకిశోర్
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్‌ఆర్ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్‌ఆర్ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్(M. Danakishore) అధికారులను ఆదేశించారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్‌ఆర్ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్‌ఆర్ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్(M. Danakishore) అధికారులను ఆదేశించారు. గవర్నింగ్ బాడీ హైడ్రా కోసం ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయనున్న నేపథ్యంలో సహకారం అందించేందుకు దానకిషోర్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ(GHMC, HMDA), వాటర్ వర్క్స్, హైడ్రా, రెవెన్యూ, పోలీసు, అటవీ, అగ్నిమాపకశాఖ, మునిసిపాలిటీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న అన్ని లేక్స్‌ల మ్యాపింగ్ కోసం ప్రొఫెషన్ ప్రభుత్వ ఏజెన్సీతో స్టడీ చేయించాలన్నారు. ఓఆర్‌ఆర్ లోపల ఫ్లడ్, అగ్నిప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, ట్రాఫిక్ రిలేటెడ్ ఆక్రమణలు, వాటర్ లాగింగ్ తదితర వాటిని మ్యాపింగ్ చేపట్టాలన్నారు.
ఓఆర్‌ఆర్ లోపల ప్రకృతి విపత్తులు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైడ్రాకు అందజేయాలని ముఖ్య కార్యదర్శి సూచించారు. సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎండీ ముషారఫ్ అలీ, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కలెక్టర్లు అనుదీప్, శశాంక, గౌతమ్, వల్లూరు క్రాంతి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జాయింట్ సీపీ జోయల్ డెవిస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాలుగు జిల్లాల కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయగా.. కమిటీ చైర్మన్‌గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, మిగతావారిని సభ్యులుగా నియమించారు. పది రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని దానకిశోర్ సూచించారు. అదేవిధంగా ఓఆర్‌ఆర్ లోపల అన్ని ప్రభుత్వ ఆస్తులకు జియో ట్యాగింగ్ చేసే బాధ్యతను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగించారు.
Oct 03 2024, 10:20