చింతపల్లి - నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్
ఏపీని వర్షాలు వీడటం లేదు. మొన్నటి వరకు విజయవాడలో వర్ష బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలకు గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడు బెజవాడ వాసులు వర్షాల నుంచి కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు అల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల వర్షానికి పలుచోట్ల కొట్టుకుపోయిన కాజ్ వే లు కొట్టకుపోయాయి.
ఏపీని వర్షాలు వీడటం లేదు. మొన్నటి వరకు విజయవాడలో వర్ష బీభత్సం అంతాఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలకు గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడు బెజవాడ వాసులు వర్షాల నుంచి కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు అల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల వర్షానికి పలుచోట్ల కొట్టుకుపోయిన కాజ్ వే లు కొట్టకుపోయాయి. చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్ అయ్యాయి
గిరిజన ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చింతపల్లి - నర్సీపట్నం ప్రధాన రహదారిలో జాతీయ రహదారి నిర్మాణాల కోసం మడిగుంట, రాజుపాకలు గ్రామాల వద్ద వరద ఉధృతికి కాజ్ వే కొట్టుకొని పోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి చింతపల్లి నర్సీపట్నం మార్గంలో నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. రింతాడ గ్రామం వద్దనున్న మరో కాజ్వే కూడా కొట్టుకొని పోవడంతో సీలేరు చింతపల్లి మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే జాతీయ రహదారి అధికారులు అక్కడకు చేరుకుని కాజ్ వేలు పునరుద్ధరణ చర్యలను ప్రారంభించారు.
మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఉత్తర ఒడిస్సాలో పూరి - పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని డేగ అల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి. కోస్తాలో తీరం వెంబడి 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం కాకినాడ రేవుల్లో మూడవ ప్రమాదక హెచ్చరిక జారీ చేయనున్నారు. ఈ నెల12 వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
Sep 09 2024, 14:13