భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత
భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలు (Heavy Rains) జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహాల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను మూసివేశారు. అలాగే అరకు ఘాట్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అరకుకు పర్యాటకులు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు... మెగాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి మట్టాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 61 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 57.4 అడుగులు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలలో వర్షం లేకపోవడంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగినట్లయితే 6 గేట్లలో 4 గేట్లు తెరవడానికి ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారన్నారు. డ్యాం దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేసి గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. ప్రజల తాగునీటి కొరకు మేఘాద్రి గడ్డ డ్యామ్‌ను నింపుకోవడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో ఈ నీటిని మంచి నీరుగా పనికొస్తుందని తెలిపారు. రిజర్వాయర్లలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఈతలు కొట్టడానికి దిగవద్దని కలెక్టర్ సూచించారు.
కాగా.. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. అటు సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలాశయంకు ఎగువ ప్రాంతం నుంచి అధికసంఖ్యలో నీటినిల్వలు వస్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి డొంకరాయి జలాశయం నుంచి లక్ష 10వేలు క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం పవర్ కెనాల్ నుంచి 4వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.డొంకరాయి జలాశయానికి లక్ష 10వేలు క్యూసెక్కులు నీటి నిల్వలు ఇన్‌ఫ్లోగా వస్తున్నాయి.
మరోవైపు రెండు రోజుల వర్షానికి ఏజెన్సీలో కొండ చరియలు విరిగిపడి ఆదివాసీల గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక బాలిక వరదలో గల్లంతైంది. నలుగురు గిరిజనులకు గాయాలయ్యాయి. గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయితీ చట్రపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కొండపై నుంచి కొండచరియలు జారిపడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గిరిజన గ్రామాల ప్రజలు మొర పెట్టుకుంటున్నారు.
Sep 09 2024, 13:47