స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగించి ఉండటం చూసి షాకైన అధికారులు
ఇవాళ ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లను ఇంజినీరింగ్ అధికారులు తొలగించననున్నారు. మొత్తం 10 గేట్లు చైన్లు తొలగించి ఉండటాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. బ్యారేజ్‌కు ఒకవైపు 6, మరో వైపు నాలుగు స్లూయిజ్ గేట్లు ఉన్నాయి. బ్యారేజ్ నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్లు కింద వున్న వ్యర్థాలను బయటకు పంపేందుకు ఈ గేట్లను అధికారులు ఆపరేట్ చేయనున్నారు. ఈ గేట్లకు చైన్లు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పటికే బ్యారేజి మూడు గేట్లు కౌంటర్ వెయిట్లను పడవలు గుద్దు కోవడంతో విరిగిపోయిన అంశంపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. తాజాగా స్లూయిజ్ గేట్లు చైన్లు ఊడిపోయి ఉండటంతో అధికారుల్లో సందేహాలు తలెత్తాయి. కావాలని చేశారా? లేక నిర్వహణ లేక ఊడిపోయి ఉన్నాయా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ స్లూయిజ్ గేట్లు ఓపెన్ చేస్తే బ్యారేజి నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళిపోయే అవకాశం ఉంది.
ఇక ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో కొత్తవాటి ఏర్పాటు పూర్తయింది. దెబ్బతిన్న సిమెంటు దిమ్మెల స్థానం లో ఇనుప వెయిట్లు అమర్చారు. ప్రభుత్వ సలహాదారు, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడి పర్యవేక్షణలో.. 3 రోజులుగా బెకమ్ కంపెనీ నిపుణుల బృందం ఈ పనిలో నిమగ్నమైంది. బ్యారేజీ గేట్ల వెనుక సిమెంట్ కౌంటర్ వెయిట్లు దన్నుగా ఉన్నాయి. ఇటీవలి వరద ఉధృతికి ఎగువ నుంచి ఇనుప బోట్లు వచ్చి ఢీ కొట్టడంతో 64, 67, 69, 70వ నంబర్ గేట్ల వద్ద ఉండే వెయిట్లు దెబ్బతిన్నాయి. వాటిలో 64వ వెయిట్ స్వల్పంగా దెబ్బతినడంతో దానిని మార్చాల్సిన అవసరం లేదని నిర్ఱయించారు.
67, 69 కౌంటర్ వెయిట్లు మధ్యకు విరిగిపోయాయి. 70వ నంబరు వెయిట్ కు పగుళ్లు వచ్చాయి. దీంతో ఈ మూడింటి స్థానంలో స్టీల్ వెయిట్లు బిగించారు. వీటిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. బిగించిన వెయిట్లలో ఇప్పుడు ఇనుము, సిమెంటు మిశ్రమం పోయాల్సి ఉంది. కొత్త కౌంటర్ వెయిట్లను సీఎం చంద్రబాబు ఆదివారం పరిశీలించారు. కన్నయ్యనాయుడు పనుల వివరాలను ఆయనకు వివరించారు. అదే సమయంలో 69వ నంబరు గేటు వద్ద ఇరుక్కుపోయిన మూడు బోట్లను సీఎం పరిశీలించారు. వాటిపై అధికారుల ను ప్రశ్నించారు. ఈ బోట్లపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు బదులిచ్చారు.
Sep 09 2024, 12:56