రోడ్లపై మార్కింగ్ కలకలం
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కోసం వేసిన కొలతల మార్కింగ్ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల నుంచి రోడ్డు వెళ్తుందని ఇప్పటికే అధికారు లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కానీ, ఎక్కడ నుంచి వెళ్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం.
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కోసం వేసిన కొలతల మార్కింగ్ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల నుంచి రోడ్డు వెళ్తుందని ఇప్పటికే అధికారు లు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. కానీ, ఎక్కడ నుంచి వెళ్తుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకం. ఐదు రోజుల క్రితం మండలంలోని పుట్టపాక, సర్వేల్, మల్లారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఎవరో మార్కింగ్ చేశా రు.
ఈ మార్కింగ్ గుర్తులు ట్రిపుల్‌ఆర్ రోడ్డు కోసం చేసినట్టు ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్వేల్, పుట్టపాక గ్రామాల పరిధిలో కల్వర్టులు, రోడ్లపై ఈ మార్కింగ్‌లు ఉన్నాయి. ఎస్- 92, ఎస్-93, ఎస్-94, ఎస్-95 అంటూ తెలుపు, నలుపు రంగులతో కూడిన గుర్తులు ఉన్నాయి. దీంతో రీజనల్ రింగ్ రోడ్డులో తమ భూములు పోతాయా? అంటూ రైతులు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. ఏ గ్రామం? ఎక్కడి నుంచి, ఏ సర్వే నెంబర్లు? ఎంత వెడల్పులో రోడ్డు కోసం భూమి పోతుంది? తదితర విషయాలపై రైతులు ఆరా తీస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆర్‌ఆర్‌ఆర్‌పై సమీక్షలు నిర్వహించాక మ్యాప్‌లు, సర్వే నివేదికలు, మార్కింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
దీంతో ఆర్‌ఆర్‌ఆర్ మార్కింగ్‌పై మండలంలోని సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సంస్థాన్ నారాయణపురం మండలం మీదుగా గ్యాస్ పైప్ లైన్ కోసం ఇటీవల సర్వే చేస్తున్నారు. దీంతో ఈ గుర్తులు రీజినల్ రింగ్ రోడ్డువా? లేదా గ్యాస్ పైప్‌లైన్‌వా? అంటూ పలువురు ఆందోళన చెందుతుండగా, దీనిపై అధికారులు వాస్తవాలను వెల్లడించాలని రైతులు కోరుతున్నారు.
Sep 09 2024, 12:07