మురళి మోహన్ కు షాక్.. జయభేరికి నోటీసులు ఇచ్చిన హైడ్రా..
హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. అనుకున్నట్లుగానే హైడ్రా హైదరాబాద్ లోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. చెరువులను అక్రమించి కట్టిన కట్టడాలను కూల్చేస్తోంది. ఆక్రమణదారులు ఎవరైనా డొంట్ కేర్ అంటూ.. ముందుకెళ్తోంది. ఇప్పటికే 18 ఎకరాల భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది.
మాదాపూర్ లో తుమ్మడికుంట చెరువు అక్రమించి కట్టిన ఎన్ కన్వెషన్ కొద్ది రోజుల క్రితం హైడ్రో కూల్చివేసింది. అలాగే దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. దీంతో హైడ్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి. హైడ్రా ఇలానే ముందుకెళ్తే హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడుకొవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా హైడ్రా సిని నటుడు, నిర్మాత, మురళి మోహన్ కు చెందిన జయభేరి షాకిచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు. నోటీసులపై జయభేరీ సంస్థ ఇంకా స్పందించలేదు. అయితే చాలా మంది అక్రమార్కులు చెరువులు కుంటలు కబ్జా చేశారు.
తర్వాత జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులుక లంచాలు ఇచ్చి నిర్మాణాలకు అనుమతి తీసుకున్నారు. నిర్మాలు చేపట్టారు. ఇప్పుడు వారికి నోటీసులు ఇస్తే కోర్టు వెళ్తున్నారు. తమకు అధికారులే ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని కోర్టుకు చెబుతున్నారు. అయితే లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చిన అధికారులు అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది. అధికారుల తీరు వల్లే చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెబుతున్నారు.
Sep 07 2024, 16:52