విరాళాలు ప్రకటించడంలో ఎందుకీ తేడా.. ఏపీకి ఒక లెక్క.. తెలంగాణకు మరో లెక్కనా..!
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో వారికి సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. శుక్రవారం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.6.50 కోట్ల విరాళం వచ్చింది. జీఎంఆర్ గ్రూప్ రూ.2 కోట్ల 50 లక్షలు విరాళం ప్రకటించింది. ఇక అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు. రూ.కోటి విరాళం ప్రకటించారు.
విక్రో ఫార్మా రూ.1 కోటి విరాళం ఇచ్చారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు కూడా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాయి. అయితే ఇదే శ్రీచైతన్య విద్య సంస్థలు ఏపీకి రూ.2 కోట్లు ఇచ్చాయి. తెలంగాణ కంటే ఏపీకి రూ.కోటి ఎక్కువగా విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్ పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాలేజీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్న శ్రీచైతన్య విద్య సంస్థలు తెలంగాణకు మాత్రం తక్కువగా విరాళం ఇవ్వడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో ఒక్కొక్క ఇంటర్ విద్యార్థి వద్ద రెండు సంవత్సరాల్లో రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల వసూలు చేస్తున్న శ్రీచైతన్య విద్య సంస్థలు తెలంగాణకు మాత్రం ఏపీకి కంటే తక్కువ విరాళం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. విజయంతి మూవీస్ అధినేత మొదటగా.. ఏపీకి మాత్రమే రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తెలంగాణకు కూడా రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అయితే విరాళం ప్రకటించడంలో కూడా తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణలో ఉంటూ.. డబ్బులు సంపాదించుకునే వారు ఉన్న ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా శ్రీచైతన్య విద్య సంస్థలు పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Sep 07 2024, 11:06