జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్క్రీమ్ అమ్మకాలు..
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు.
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్‌క్రీమ్‌లను మాత్రం పిల్లలు తెగ ఇష్టంగా తింటున్నారట. రేటు ఎక్కువ ఉన్నా కూడా వెనుకాడకుండా తింటున్నారు. కారణం ఇక్కడ విస్కీని ఉపయోగించి తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లే. ఇవేంటో కూడా తెలియని చిన్నారులు ఈ ఐస్‌క్రీమ్ పట్ల ఆకర్షితులవుతున్నాయి.
భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు బయటపెట్టారు. ఇవాళ పిల్లల ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐస్క్రీమ్లో పేపర్ విస్కీ కలిపి వన్ అండ్ ఫైవ్ యజమాని అమ్ముతున్నాడు. 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నారు. ఐస్క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు.
మరింత అమ్మకాలు పెంచుకునేందుకు మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్‌లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌లను జూబ్లీహిల్స్‌లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ ఐస్‌క్రీమ్ పార్లర్ ఉంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్‌టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్‌క్రీములను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
Sep 06 2024, 18:55