జూబ్లీహిల్స్‌లో పలు రెస్టారెంట్లపై దాడులు.. కేసులు నమోదు
జూబ్లీహిల్స్‌లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెలుగు మీడియం రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన జ్యూస్‌లు, పుట్టగొడుగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెస్టారెంట్ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, మటన్‌లను కనుగున్నారు.
జూబ్లీహిల్స్‌లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెలుగు మీడియం రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన జ్యూస్‌లు, పుట్టగొడుగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెస్టారెంట్ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, మటన్‌లను కనుగున్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం రెస్టారెంట్ యాజమాన్యానికి షాకోజ్ నోటీసులు జారీ చేశారు. బిర్యానీలో వెంట్రుకులు వచ్చాయంటూ.. ఇటీవల ఓ కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
అదీకాక సోమవారం బంజారాహీల్స్‌లోని పలు రెస్టారెంట్లపై తెలంగాణ కమిషనర్ ఆప్ ఫుడ్ సేఫ్టీకి చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు వరుస దాడులు చేపట్టారు. ఈ సందర్బంగా రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహారం ఆ యా రెస్టారెంట్లలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వంటశాలలో గడువు తీరిన పలు ఆహార పదార్థాలను సైతం వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు.
అదే విధంగా పలు ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన వస్తువులపై లేబుళ్లు లేకపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ సంద్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వంటశాలతోపాటు ఆహార పదార్ధాలు నిల్వ ఉంచే ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.
ఆ క్రమంలో రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆహారంపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీకి చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై వరుస దాడులు నిర్వహిస్తున్నారు
Sep 05 2024, 19:06