ఏపీలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కాగా, జేసీబీలు, పొక్లెనర్లతో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మట్టి పెళ్లలు ఇంకాపడుతున్నాయి. మట్టిపెళ్లలు పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో జేసీబీలు, పొక్లెనర్లను సిబ్బంది వెనక్కు తీసుకెళ్లారు. సమీపంలోని ఇళ్లల్లో ఉన్న స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారీగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కొండ చరియలు మరింతగా పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలాగే క్రీస్తురాజపురంలో రెండు ఇళ్లపై కొండచరియలు పడ్డాయి. సున్నపుబట్టీల దగ్గర కొండచరియలు పడి రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇళ్లల్లో చిక్కుక్కున్న వారిని భయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు.
జల దిగ్బందంలో మైలవరం పట్టణం ఉండిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. మైలవరం ఎర్ర చెరువుకు గండి, తారక రామనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మైలవరం ప్రధాన సెంటర్‌లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది. మైలవరంలో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చండ్రగూడెం శివారు జంగాలపల్లిలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. కొండ వాగు ఉధృతికి మైలవరం - పొందుగల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బుడమేరు వరద అంతకు అంత పెరుగుతోంది.
Sep 01 2024, 14:24