చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు
హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.
హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మొత్తానికి అధికారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ వింగ్ అధికారులు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు చెందిన అధికారులు ఉన్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్.. బాచుపల్లి ఎంఆర్ఓపై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మేడ్చల్ మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజకుమార్ పై కేసు నమోదైంది. హైడ్రా సిఫారసుల మేరకు ఆయా అధికారులపై కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాదులో చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కేసులను సీపీ అవినాష్ మహంతి నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు అయ్యాయి. అదనపు సిబ్బందితో హైడ్రా మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ సైతం ఏర్పాటు కానుంది. గతంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించగా.. ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ కానున్నాయి. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్‌లో చేర్చి మరీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే 50 మంది అధికారుల చిట్టాను సిద్ధం చేసిన హైడ్రా అధికారులు ఇప్పుడు ఆరుగురిపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
మరోవైపు మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహుళ అంతస్థు భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించిన ముగ్గురు బిల్డర్స్‌పై కేసులు నమోదయ్యాయి. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులుపై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. ఈర్ల చెరువులో అక్రమంగా బహుళ అంతస్తులను ముగ్గురు బిల్డర్స్ నిర్మించారు.
Aug 31 2024, 18:04