సాక్షిపై పరువునష్టం కేసులో క్రాస్ ఎగ్జామిన్‌కు హాజరుకానున్న లోకేష్
సాక్షిపై పరువునష్టం కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకానున్నారు. ఈ నెల 29న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి లోకేష్ హాజరు కానున్నారు. ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సాక్షిపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్‌కి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిపత్రికలో అసత్యాలు, కల్పితాలతో ఓ స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని నారా లోకేష్ అప్పట్లో పేర్కొన్నారు.
అయితే దీనిపై సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు. వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్‌తో మళ్లీ మొదలైంది.
వాస్తవానికి వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. ఇది సర్వసాధారణం. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ సైతం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి టీ, కాఫీ, స్నాక్స్ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు టీ, కాఫీ, స్నాక్స్ కోసం ఖర్చు చేశారని ఒక నిరాధార కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై అప్పట్లోనే నారా లోకేష్ మండిపడ్డారు.
నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించాలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈనెల 29వతేదీన సాక్షి పత్రికపై దాఖలుచేసిన పరువునష్టం దావా కేసులో వాయిదాకు నారా లోకేష్ హాజరుకానున్నారు.
Aug 28 2024, 14:42