తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సర్కార్.. ఇప్పుడు మరో దరఫా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సర్కార్.. ఇప్పుడు మరో దరఫా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు మంజూరు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
కాగా, మంగళవారం నాడు స్పీడ్(స్మార్ట్ ప్రోయాక్టీవ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో అధికారులకు సీఎం కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు మరోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అలాగే, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌కు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి భూ బదలాయింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్‌తో డిజైన్లు రూపొందించాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిని నిర్మించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు ఉండాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.
Aug 27 2024, 20:20