బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికొస్తే సహించేది లేదు...చాడ కిషన్ రెడ్డి
రేవంత్ మెప్పు పొందేందుకే కోమటిరెడ్డి వింత చేష్టలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది
విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి
నల్లగొండలో బిఆర్ఎస్ ఆఫీసును కూల్చేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పదేపదే అనే మాటలను ఇక ఆపాలని పార్టీ ఆఫీసు జోలికి వస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హెచ్చరించారు.
ఆయన బుధవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని
పార్టీ ఆఫీసు కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదు అనే విషయాన్ని కోమటిరెడ్డి గ్రహించాలన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకపోతే మీరు కూడా భూమి ప్రభుత్వం నుంచి కేటాయించుకొని నిర్మించుకోండి కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద పడి కూల్చేస్తాం అనే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మేము చంద్రబాబు రేవంత్ రెడ్డి ల తొత్తులం కాదు.
అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం . టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ . మా జోలికొచ్చిన, మా ఉద్యమకారుల జోలికి వచ్చిన, మా పార్టీ ఆఫీస్ జోలికి వచ్చిన, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు .
30 ఏళ్లు మీరు రాజకీయంలో ఉండి నల్లగొండలో కనీసం పార్టీ ఆఫీసు నిర్మించుకోలేదని ..కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ తాబేదారులుగా తిరగాలని ఆలోచనతోనే పార్టీ ఆఫీసు నిర్మించకుండా ఉన్నారన్నారు.. రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బిఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారని మీరు ఏందో నల్లగొండ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో భూమి ఇస్తే అక్కడ ఆఫీసు నిర్మాణం చేశామని
కానీ రాష్ట్రంలో మీరు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద పడ్డారు అని ప్రశ్నించారు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తుందని రానున్న రోజుల్లో ప్రజల నుంచి మీకు బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.. వ్యక్తిగత కుట్రలు ద్వేషాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. 6 గ్యారంటీలతోపాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనించాలి తప్ప టిఆర్ఎస్ పార్టీపై ఏడవడం సరికాదన్నారు.. పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్లకుండా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లిన విషయం దృష్టిలో ఉంచుకోవాలని గుర్తు చేశారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు సగం మంది రైతులకు కూడా చేయని మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.. టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు ఆపి ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అది వీడి పార్టీ ఆఫీసును కూల్చాలని టిఆర్ఎస్ పార్టీ వాళ్లపై విమర్శలు చేయాలని ఆలోచిస్తే మాత్రం ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కనగల్ పిఎసిఎస్ చైర్మన్ తోటి శ్రీనివాస్ ఎస్కే లతీఫ్ పోలే వెంకటాద్రి కర్నాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Aug 07 2024, 19:44