హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్
షేక్ హసీనాతోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
తప్పని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగారు. అనంతరం సోదరి షేక్ రెహనాతో కలిసి ఆమె భారత్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వీరు లండన్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అలాంటి వేళ.. బంగ్లాదేశ్‌లో సరికొత్త డిమాండ్ ప్రారంభమైంది
షేక్ హసీనాతోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ అల్లర్లలో వందలాది మంది ప్రజలు మరణించారన్నారు. అందుకు షేక్ హసీనా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోదరితోపాటు ఆమెను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని భారత్‌కు ఈ సందర్భంగా ఆయన సూచించారు. దేశంలో అత్యయక స్థితిని విధించవద్దంటూ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ అనుకూలురుతోపాటు షేక్ హసీనా వ్యతిరేకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు జడ్జిలు.. తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ సంస్థల అధినేతలు, ఉన్నతాధికారులను కూడా రాజీనామా చేయాలనే పేర్కొన్నారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు.
ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఆగస్ట్ 5వ తేదీన తప్పని సరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశంలో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్త ఆందోళనలు మొదలైనాయి. ఆ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ్యవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు భారీగా చేపట్టిన విషయం విధితమే.
మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రద్దు చేశారు. ఆ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వాన్ని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బ్యాంకర్ ప్రొ.యూనస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జైలు నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్ పర్సన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు.
Aug 07 2024, 12:50