/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz 'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి' జాతీయ వార్షికోత్సవాలు  పోస్టర్ విడుదల Mane Praveen
'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి' జాతీయ వార్షికోత్సవాలు  పోస్టర్ విడుదల
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో సోమవారం 'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ' పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ఈ నెల 11న ఉదయం 10. గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరగనున్నాయని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలలో మర్రిగూడ మండల బహుజన, గౌడ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జై గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షులు బొమ్మగాని శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కాట్కూరి వెంకటరమణ, అధికార ప్రతినిధి వల్లపు కేశవ గౌడ్, గీత పని వారాల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎరుకల నిరంజన్ గౌడ్, మర్రిగూడ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్, మర్రిగూడ గీత కార్మిక సంఘం అధ్యక్షులు గునిగంటి శ్రీరాములు గౌడ్, మర్రిగూడ గౌడ సంఘం నాయకులు జమ్ముల వెంకటేష్ గౌడ్, ఉడుగు అంజయ్య గౌడ్, వెంకటంపేట బాలయ్య, విరమళ్ళ ముత్యాలు గౌడ్, నాగిళ్ళ మారయ్య, పగడాల యాదయ్య, ఎం.డి.నజీర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన CMRF చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ:మండలం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం తో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ పంపిణి చేశారు.                                  కొండూరు లో సేతా సత్తార్ రూ.48,000/-, దుబా యాదయ్యగిరి రూ.40,500/- మర్రిగూడ గ్రామానికి చెందిన చాట పద్మ భర్త అంజయ్య కు 30000 రూపాయలు చెక్కు, ఆంబోతు బిచ్చ నాయక్ 60000/- పగడాల చిన్న అంజయ్య కు రూ. 60000 /-, చిలువేరు శివ తండ్రి రాములు కు రూ. 28000 /- చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాయికాడికొండల్, జల వెంకయ్య, జంగయ్య,అశోక్ రెడ్డి , తన్నరు యాదయ్య,ఉడుగు ఆంజనేయులు, దండుగుల కృష్ణ, మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్, మర్రిగూడ మాజీ ఎంపిటిసి వెంకటం పేట బాలయ్య, పంతంగి సుధాకర్, గ్యార యాదయ్య, పొనుగోటి శేఖర్, సిల్వర్ చంద్ర, ఎండి షాప్, గొట్టిముక్కల ప్రకాష్, పగడాల రఘు, పగడాల లింగయ్య, ఎండి అశ్వకు, ఈద రాములు, పల్ల మల్లేష్ పగడాల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రేపు మర్రిగూడ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

NLG: ఆగష్టు 6న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మర్రిగూడ మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గం.3:20 లకు శివన్నగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభిస్తారు. 4 గంటలకు శివన్నగూడ - అంతంపేట రోడ్డు లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.5 గంటలకు తిరుగండ్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ - స్టేషన్ ను ప్రారంభిస్తారని,మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ తెలిపారు.

NLG: రేపు మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
రేపు ఆగస్టు 6న  తెలంగాణ ఉద్యమ ప్రముఖ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా, నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆచార్య జయశంకర్ జయంతిని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు కార్యాలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని కోరారు.
శివన్నగూడెం: సిపిఎం ప్రచార రథాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి
NLG: మర్రిగూడ మండలం, శివన్నగూడెంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, ఇవాళ సిపిఎం ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎనుకబడిన మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగు,త్రాగునీరు  ఇవ్వడంలో పాలక పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని..డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించి పనులు పూర్తి చేయుటకు తగిన నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ఈ నెల 9న జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల నాయకులు బోట్ట శివకుమార్, మైల సత్తయ్య, రాములు శంకర్ అలివేలు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
నల్లగొండలో ఆగస్టు 9న జరిగే సదస్సును జయప్రదం చేయండి: ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపు
*మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ*
నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడంలో పాలక పార్టీలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని ప్రాజెక్టుల డిపిఆర్ ను ఆమోదించి నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని కోరుతూ.. ఆగస్టు 9న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు వేలాదిగా జనం తరలి వచ్చి జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ.. అత్యధిక ఫ్లోరిన్ ఈ ప్రాంతంలోనే ఉన్నదని దీనివల్ల ప్రజల తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతున్నారని అన్నారు. సాగునీరు లేకపోవడం వలన భూములు బీడులుగా మారాయని తెలిపారు. కూలీలు, ప్రజలు  గ్రామాలకు గ్రామాలు వలసలు పోయే పరిస్థితి దాపురించిందని అన్నారు.కేసీఆర్ హయాంలో గత పది సంవత్సరాల అధికారంలో కొనసాగినా ఫ్లోరిన్ బాధితుల గురించి ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ తాగునీరు, సాగునీరు అందించడానికి అవసరమైన డిండి ఎత్తిపోతల పథకాన్ని డిపిఆర్ ఆమోదించకపోవడం చాలా అన్యాయం అన్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జీవోఎంఎస్ నెంబర్ 105 ద్వారా డీపీఆర్ ను ఆమోదించారని కానీ 107 జీవో ద్వారా డిండి ఎతిపోతుల పథకం డీపీఆర్ ను ఆమోదించలేదని తెలిపారు.  మునుగోడు, దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ డిండి ప్రాజెక్టు విషయంలో దృష్టి సారించలేదని ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే డిపిఆర్ ను ఆమోదించి తగినన్ని నిధులు విడుదల చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.  ప్రాజెక్టు పూర్తి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలన చేయడం జరిగిందని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించినట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల పూర్తి కి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 9న శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు  నాగార్జున, బండ శ్రీశైలం, మర్రిగూడ మండల కార్యదర్శి, ఏర్పుల యాదయ్య, నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, సిపిఎం నాయకులు బొట్టు శివకుమార్, మైల సత్తయ్య, కొమ్ము లక్ష్మయ్య, నీలకంఠం రాములు, కొట్టం యాదయ్య, దామెర లక్ష్మి, మల్లేటి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: 40 వేల రూపాయల విలువైన గ్రూప్స్ మెటీరియల్ అందజేత

నాతి లక్ష్మి నరసింహ  ఫౌండేషన్ (NLN)  వ్యవస్థాపకులు డాక్టర్ నాతి శ్రీనివాసులు ఆదివారం ఎంవిఎన్ ట్రస్ట్ లైబ్రరీ  కి 40 వేల రూపాయల విలువైన గ్రూప్స్-1, 2 స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు నాతి స్వామి, ఎం వి ఎన్ ట్రస్ట్ ఇంచార్జ్ నర్సిరెడ్డి, ముఖ్య అతిథి, మరియుకన్వీనర్ డాక్టర్ అక్కినపల్లి మీనయ్య,  ఏఎస్పి భాస్కర్ గౌడ్ సమక్షంలో ఆదివారం నల్గొండ పట్టణంలో విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  నాతి గణేష్ , మల్లం మహేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: చెరువుగట్టు లో పెరిగిన భక్తుల రద్దీ
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి, మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. ఉచిత దర్శనం లో స్వామి వారిని దర్శించుకోవడానికి గంటకు పైగా సమయం పడుతుంది. అయితే భక్తులు అమావాస్య రాత్రి చెరువుగట్టు గుట్టపైన దైవ సన్నిధిలో నిద్రించి.. ఉదయం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది.
RR: జిల్లా బిజెపి ఎస్టీ మోర్చా ఇన్చార్జిగా కేతావత్ భాస్కర్ నాయక్
రంగారెడ్డి రూరల్ జిల్లా బిజెపి పార్టీ ఎస్టీ మోర్చా ఇన్చార్జిగా కేతావత్ భాస్కర్ నాయక్ నియామకం అయ్యారు.

ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. ఎస్టి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న తనకు జిల్లా బిజెపి ఎస్టీ మోర్చా ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చిన బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జె కళ్యాణ్ నాయక్, ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేనావత్ రవి నాయక్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కు, ఎస్టీ మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకులకు ధన్యవాదములు అని తెలిపారు.
                                                                                                            
ఏపీ లింగోటం: విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ
క్లీన్ హోం గ్రీన్ హోం ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో, ఈ రోజు నార్కట్ పల్లి మండలంలోని ఏపీ లింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.