96 మంది డీఎస్పీలు ‘బదిలీ’
రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో... వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించడంతోపాటు వివిధ కారణాలతో ఏకంగా 57 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సబ్ డివిజనల్ అధికారులతోపాటు సీఐడీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్‌లో పనిచేస్తున్న కొందరు డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. వీరిలో శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ వైసీపీతో అంటకాగిన వారు
చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘సిట్’, ఇంటెలిజెన్స్‌లో ఉంటూ పీఎస్సార్ ఆంజనేయులు కనుసన్నల్లో పని చేసిన వారు, సీఐడీలో విధులు నిర్వహిస్తూ తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఉన్నారు.
శాంతిభద్రతల విభాగంలో 35 సబ్ డివిజన్లకు చెందిన 22 మంది డీఎస్పీలను అక్కడి నుంచి తప్పించారు. గన్నవరం డీఎస్పీగా ఉన్న జయసూర్యను మాత్రం భీమవరం బదిలీ చేశారు. మిగిలిన 21 మందికి కొత్తగా డీఎస్పీ పోస్టింగ్ లభించింది. వీరంతా ఐదేళ్లుగా లూప్‌లైన్‌లో ఉన్న వారే.
శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ... బదిలీ అయి పోస్టింగ్ దక్కని వారిలో... వై.శృతి (శ్రీకాకుళం), జి.నాగేశ్వర రెడ్డి (కాశీబుగ్గ), డి. బాలచంద్రారెడ్డి (టెక్కలి), ఎ.ఎస్, చక్రవర్తి(చీపురుపల్లి), హనుమంతరావు (కాకినాడ), విజయ్ పాల్ (రాజమండ్రి సెంట్రల్), అంబికా ప్రసాద్ (రాజమండ్రి దక్షిణ), పి. శ్రీకాంత్(గుడివాడ), నారాయణ స్వామి రెడ్డి (భీమవరం), మురళీ కృష్ణా రెడ్డి (విజయవాడ వెస్ట్), ఎం. రమేశ్ (తెనాలి), రవికాంత్ (గుంటూరు నార్త్), మహబూబ్ బాషా (గుంటూరు సౌత్), శ్రీనివాసరావు (గురజాల), కిశోర్ బాబు (ఒంగోలు), అశోక్ వర్ధన్ (దర్శి), బాలసుందర్ రావు (మార్కాపురం), వీరాంజనేయ రెడ్డి (నెల్లూరు రూరల్), బాజీజాన్ సైదా (పెనుకొండ), సూర్యనారాయణ రెడ్డి (గూడూరు), శ్రీనివాస రెడ్డి (నాయుడు పేట), ఉమా మహేశ్వర రెడ్డి (శ్రీకాళ హస్తి), శ్రీనివాస రెడ్డి (డోన్), శ్రీనివాసులు (ఏలూరు), ప్రసాద రెడ్డి (మదనపల్లె), వినోద్ కుమార్ (పులివెందుల), మురళీధర్ (ప్రొద్దుటూరు), శివభాస్కర్ రెడ్డి (గుంతకల్), బి. శ్రీనివాసులు(కళ్యాణదుర్గం), వాసుదేవన్ (పుట్టపర్తి), విజయ శేఖర్ (కర్నూలు), రవీంద్రనాథ్ రెడ్డి (నంద్యాల) ఉన్నారు. వీరిలో చాలామంది గత ప్రభుత్వంలో వైసీపీ భక్తులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి.
Aug 01 2024, 16:59