/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz గ్రామాలలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు ఎరువుల పట్ల అవగాహన కలిగి ఉండాలి: వలిగొండ ఎస్సై డి మహేందర్ Vijay.S
గ్రామాలలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు ఎరువుల పట్ల అవగాహన కలిగి ఉండాలి: వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ఎస్సై డి మహేందర్ మాట్లాడుతూ ... గ్రామంలో ఎవరైన మత్తు పదార్థాలు (డ్రగ్స్) సరఫరా చేస్తున్నా/ సేవిస్తున్నా వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు. వర్షాకాల విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి ప్రతీ ఒక్కరు నకిలీ విత్తనాలు మరియు ఎరువుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎవరికైనా నకిలీ విత్తనాలు/ఎరువులు అమ్ముతున్నారు అనే సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. గ్రామంలోని యువత మత్తు పదార్థాలకు(డ్రగ్స్ ) కు అలవాటు అయి వారి ప్రవర్తనలో ఏమైన మార్పులు కలిగినా వెంటనే వారికి అవగాహన కల్పించడం కోసం పోలీస్ వారికి సమాచారం అందించి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కలిగి ఉండి, తమ స్నేహితులకు, తోటి వారికి అవగాహన కల్పించాలి. గ్రామాల్లో ఎవరైనా రాత్రివేళ కొత్త వ్యక్తుల సంచారాన్ని గమనించినట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసు వారికి తెలియ పరచాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను మార్చడం సరైన పద్ధతి కాదు: వలిగొండ మాల మహానాడు అధ్యక్షులు నీలం నరేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర రాజ ముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం, ప్రభుత్వం మారగానే ప్రభుత్వ చిహ్నాలు మార్చడం సరైన నిర్ణయం కాదని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు నీలం నరేందర్ అన్నారు . బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ మారుస్తానని అనడం, కాంగ్రెస్ బిజెపి దొండుదొండని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలయ్యేలా చూడాలని అన్నారు.

బడిబాట కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ హనుమంతు కే జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా లో బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని గురువారం కలెక్టర్ హనుమంతు కే జెండగే అధికారులను కోరారు. జూన్ 3 నుంచి 19 వరకు జరిగే బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు .బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, భువనగిరి ఆర్డీవో అమరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చౌటుప్పల్ మండల అధ్యక్షులుగా గట్టు సుధాకర్ నియామకం

తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలలో పాల్గొని తెలంగాణ సాదనే లక్ష్యంగా పనిచేసిన తెలంగాన ఉద్యమ కారుడు గట్టు.సుధాకర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చౌటుప్పల్ మండల అధ్యక్షులుగా గట్టు సుధాకర్ ను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్బంగా గట్టు.సుధాకర్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించి నియమించినందుకు రాష్ట్ర అద్యక్షులు చీమ.శ్రీనివాస్,ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యంవంతం చేసి,అనేక తెలంగాణ ఉద్యమ పోరాటాలు చేసి నష్టపోయిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేయాలని అన్నారు.ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు.ఈ సమావేశంలో బాబు. లింగం తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు వాల్యుయేషన్ వల్ల నష్టపోయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు న్యాయం చేయాలి : AISF

తప్పుడు వాల్యుయేషన్ వల్ల నష్టపోయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ న్యాయం చేయాలి* ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి వస్తూపూల అభిలాష్ , ఉప్పుల శాంతి కుమార్. ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యం ఇంటర్ ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ చేసిన వారు అలసత్వం వహించి తప్పులుగా ప్రశ్నాపత్రాలు దిద్దడం వల్ల వేలాది మంది విద్యార్థులకు నష్టం వాటిల్లిందని మెరిట్ స్టూడెంట్ విద్యార్థికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులు రెండో సంవత్సరంలో వచ్చిన మార్కులు చూస్తే చాలా విచిత్రంగా ఉందని విద్యార్థులు తమకు ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వస్తాయో ముందే పరీక్ష రాశాక ఊహించుకుంటారు అని ఫలితాలు అనంతరం మార్కులు చూసి షాక్ కి గురయ్యారని రివాల్యుయేషన్, రీకౌంటింగ్ తో పేపర్లు తెప్పించుకుని చూస్తే పేపర్ వాల్యువేషన్ చేసిన వారి తప్పులు బయటపడ్డాయని, పేపర్ వాల్యుయేషన్ లో ఇష్టానుసారంగా పేపర్లు దిద్దారని వచ్చిన మార్కులు ఒకటైతే ఆన్లైన్లో ఇంకో రకంగా మార్కులు వేశారని, ఇంటర్ ప్రశ్నాపత్రాల వాల్యువేశన్ ఇష్టానుసారంగా చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని ,పేపర్ వాల్యుయేషన్ ను ప్రైవేట్ కళాశాల, ప్రభుత్వ కళాశాల లెక్చరర్లు చేస్తారని ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్హత లేని వారు పనిచేయడం వారిని వాల్యుయేషన్ కి కళాశాల యాజమాన్యాలు పంపియాడం దీనితో వారు ఇష్టానుసారంగా వాల్యువేషన్ చేసి మార్కులు వేశారని ఇంటర్మీడియట్ విద్య విద్యార్థులకు ఇంటర్మీడియట్ మార్కుల శాతం ఉన్నత చదువులో చాలా కీలకం అని అలాంటి ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ లో తప్పులు దొరలడం విద్యార్థుల విద్య భవిష్యత్తుకి నష్టం చేకూర్స్తుందని, సప్లమెంటు పరీక్షల తేదీని పొడిగించి రీకౌంటింగ్, రివాల్యుయేషన్ ఏదైనా మాత్రం పొడిగించలేదని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులు రీకౌంటింగ్, రివాల్యుయేషన్ ఫీజులు కట్టే పరిస్థితి లేదని వారు చాలావరకు కట్టలేకుండా పోయారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని వారు ప్రశ్నించారు. వేలాది సంఖ్యలో విద్యార్థులు ప్రశ్నాపత్రల తప్పుడు వాల్యుయేషన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ఇంటర్ బోర్డు ఇప్పటివరకు విద్యార్థులకు ఒక స్పష్టమైన భరోసా ఇవ్వలేదని తప్పుడు వాల్యుయేషన్ వల్ల నష్టపోయిన విద్యార్థులందరికీ వెంటనే ఇంటర్ బోర్డు న్యాయం చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడిస్తామని అభిలాష్ ,శాంతి కుమార్ హెచ్చరించారు.

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ బొమ్మలరామారం మండల అధ్యక్షులుగా ఇప్పలపల్లి నరేందర్ ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ బొమ్మలరామారం మండల అధ్యక్షులుగా ఇప్పలపల్లి నరేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గురువారం రోజున జరిగిన మండల సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్ బాబా పాల్గోని వారికి నియామక పత్రాన్ని అందజె శారు .అనంతరం నూతన మండల కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిలో ఉపాధ్యక్షులుగా జెమ్మి గారి విజయరాజ్ ,ప్రధాన కార్యదర్శిగా గూదె బాలరాజు, సహాయ కార్యదర్శిగా గడ్డం హరీష్, కోశాధికారిగా బేతల లక్ష్మణ్ , కార్య వర్గ సభ్యులుగా ఎల్లబోయిన విశ్వనాథం తదితరులు ఎన్నుకున్నారు.


బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులుగా గొడిగే ఆనంద్ గౌడ్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్  వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు బొడిగె ఆనంద్ గౌడ్ ను యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించారు. ఈసందర్బంగా బొడిగె ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ నన్ను జిల్లా కార్యవర్గ సభ్యులు గా నియమించిన జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నా వంతు గా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.నాకు సహకరించిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలే చంద్రశేఖర్ గారికి జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి గారికి అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారికి ,దంతూరి సత్తయ్య , మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ గారికి తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.

నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వండి: కూచిమల్ల కుమార్ నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు

తెలంగాణ నిరుద్యోగ ఉద్యమ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని నిరుద్యోగ ఉద్యమ కళాకారుడు కూచిమల్ల కుమార్  విలేకరుల సమావేశంలో ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భుజాన గొంగడేసి కాళ్లకు గజ్జ కట్టి ధూంధాం కార్యక్రమాలు ఎన్నో చేశామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజు మా గళంతోనే ధూంధాం కార్యక్రమాలు మొదలు అయ్యేవని, మా కళాకారుల ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరి పోశామని అన్నారు. తెలంగాణ ఉద్యమ మలిదశ సమయంలో కూలీ పనులు చేసుకుని జీవనం గడిపే మేము పనులు మాని ఉద్యమంలో పాల్గొంటే మా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కళాకారులను పక్కనపెట్టి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు మేము ఉద్యమకారులమని గొప్పలు చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకునే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు? ఎక్కడ? పాల్గొన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేము చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి కళాకారుల ఉద్యోగ ప్రకటన చేసి నిజమైన కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

భీమలింగం కత్వకు నూతన గేట్లు ఏర్పాటు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని బీమలింగం కత్వ గేట్లు పాడయిపోయాయి. వాటి స్థానంలో మూడు నూతన గేట్లను తన సొంత నిధులతో ఎర్పాటు చేయించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గేట్లు ఎర్పాటు చేయడం జరిగింది. గేట్ల ఏర్పాటు వలన రైతులకు ఎంతగానో లబ్ది చేకూరుతుందని రైతులు హర్శం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి క్రుతజ్ణతలు తెలిపారు.


ముస్త్యాల పల్లి లో వర్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రం హెడ్ ఆఫ్ సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో వర్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రమ్ హెడ్ ఆప్ సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం చేయడం జరిగిందని సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది .కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్ల అద్దాలు వెంటనే ఇవ్వడం జరిగింది. గుండె పరీక్షలు, ఈసీజీ, రక్తము ,మూత్రము, షుగర్, బీపీ , దంత పరీక్షలు నిర్వహించి మందులు, సిరప్ లు ఇవ్వడం జరిగినది. ఎక్స్రేలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అందరు వినియోగించుకొని స్వచ్ఛంద సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ చంద్రయ్య , పెద్దలు మాజీ ఉపసర్పంచ్ సీనియర్ నాయకులు వడ్డే బిక్షపతి , మరియు మాజీ సర్పంచ్ గంధ మల్ల హేలేందర్ , పెద్దలు గంధ మల్ల జానకిరామ్ , వడ్డేమాన్ బిక్షపతి, వడ్డేమాన్ రాములు, మరియు రావుల మల్లేష్, ఆశ్రయం సంస్థ డైరెక్టర్ జయరాజు , డాక్టర్ జయంత్ , మేడమ్ డాక్టర్ సంధ్యారాణి ఎంబిబిఎస్ , వర్డ్స్ సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య, డానియల్ ,యువకులు కళ్లెం రాజు, కళ్లెం రత్నం, కళ్లెం సామ్సన్ ,కళ్ళెం సొలమోను, గంటపాక రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.