జూన్ 15, 16 తేదీలలో భువనగిరిలో జరుగు సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదం కై ఆహ్వాన సంఘం ఏర్పాటు: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి
జూన్ 15, 16 తేదీలలో రెండు రోజులపాటు భువనగిరి పట్టణ కేంద్రంలో జరిగే సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదంకై ఏర్పాటుచేసిన ఆహ్వాన సంఘం సమావేశంలో ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిపిఎం నాయకత్వానికి పార్టీ సభ్యులకు రాజకీయంగా చైతన్యం కలిగించడం కోసం జూన్ 15,16 తేదీలలో భువనగిరి పట్టణ కేంద్రంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా ప్రయోజనకర పథకాలను ప్రజలకు నేరుగా చేరేలా బాధ్యత తీసుకోవాలని, ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు కాలయాపన జరిగిన, ప్రస్తుతం ప్రజా సమస్యలను నియోజకవర్గాల వారీగా అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని వారు అన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకత్వానికి, పార్టీ సభ్యులకు రాజకీయ చైతన్యం కలిగించి, గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర కార్యక్రమాలను రూపొందించి ప్రజా పోరాటాలను నిర్వహించడం కోసం భవిష్యత్ ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయడం కోసం ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని వారు అన్నారు. అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ
భువనగిరి పట్టణ కేంద్రంలో నిర్వహించే సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, విద్యావంతులు, వ్యాపారస్తులు సహకరించి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం శిక్షణ తరగతుల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులు గద్దె నరసింహ, అధ్యక్షులు బట్టుపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శి మాయ కృష్ణ, చీప్ ప్యాటరన్స్ గా సంగు నరేందర్, సంగు రమాదేవి, ఉదయగిరి మధుమోహన్,పోకల దయానంద్, జిట్టా ధనాపరెడ్డి, ఉపాధ్యక్షులు గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, ఓవల్దాస్ అంజయ్య, బర్ల వెంకటేష్, దాసరి మంజుల, కార్యదర్శులుగా బండి రవి, పర్వతి బాలకృష్ణ, దండు గిరి, కల్లూరి నాగమణి, కొండెం నాగభూషణం, ప్రచార కార్యదర్శులు కొలుపుల వివేక్, వనం రాజు, చింతల శివ, ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ,గడ్డం వెంకటేష్,నాయకులు లావడ్య రాజు,బోడ భాగ్య, లలిత, మాయ రాణి,గీస అంజయ్య, నరాల నరసింహ,గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
May 26 2024, 20:32