భవన నిర్మాణ కార్మికులకు రావలసిన పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలి : కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు
అసంఘాటీత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు నూతనంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తంబు విధానని రద్దుచేసి పాత పద్ధతినే గుర్తింపు కార్డులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘo రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని తాపీ సంఘం భవన ప్రారంభోత్సవానికి రత్నాకర్ రావు మరియు ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై శిలా పలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ చాలామంది కార్మికులకు రేషన్ కార్డులు లేనందున నూతన లేబర్ కార్డులు రావడం లేదని కావున ప్రభుత్వ వెంటనే నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని, 60 ఏళ్ళు వయస్సు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ మరియు ఇతర బెనిఫిట్ బకాయిలను వెంటనే ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికుల అడ్డాల వద్ద అన్ని మౌలిక వసతులు ప్రధానంగా షెల్టర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ప్రమాదంలో మరణించిన భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి రూ.10లక్షలు, సహజ మరణం పొందితే రూ.5 లక్షలు, పెండ్లి కానుక ఒక లక్షకు పెంచాలని, పిల్లల చదువుకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు దాసరి లక్ష్మయ్య, పోచంపల్లి మండల అధ్యక్షులు చేరాల లింగయ్య, ఉపాధ్యక్షులు దేవిగారి బాలయ్య, ప్రధాన కార్యదర్శి కొత్త నరేష్, సహాయ కార్యదర్శి రామచర్ల సందయ్య, కోశాధికారి పోతగళ్ల బాలరాజు మరియు మాజీ మండల అధ్యక్షులు పొన్నమోని ఎట్టయ్య, చేరాల పెద్ద నర్సింహా, పెద్దల యాదయ్య, ఇబ్రహీంపట్నం అంజయ్య, చెరుకు నరసింహ, సలహాదారులు చీరాల చిన్న నరసింహ, కొండమడుగు బాలయ్య, గోరికంటి బాలయ్య, జక్కి రమేష్, గుర్రు దానయ్య, నాయకులు కొండమడుగు మైసయ్య, పొన్నమోని శ్రీశైలం, చేరాల రాజయ్య, చేరాల యాదయ్య, తదితర 100 మంది భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
May 22 2024, 20:21