/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఆలేరులో రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిలువలను పరిశీలించి, ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Vijay.S
ఆలేరులో రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిలువలను పరిశీలించి, ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా  అలేరు పట్టంణంలోని మల్లికార్జున ఆగ్రో రైస్ మిల్లును *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* సందర్శంచారు ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో, రైస్ మిల్లు యజమానుల తో మాట్లాడారు.. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిలువను పరిశీలించారు.గత వానాకాలం,యాసంగి ధాన్యం నిలువ ఉండటం వళ్లే ఈ కాలం ధాన్యం ఆన లోడింగ్ కు ఇబ్బందులు అవుతున్నయని పరిశీలినలో తెలుసుకున్నారు.అనంతరం ఆలేరు పట్టంణంలోని మార్కెట్ యార్డును పరిశీలించారు.రైతులతో,హామలి కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు..ఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.గతం కంటే ప్రస్తుతం విద్యుత్ ఎక్కువగా అందిస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి తెలిపారు. ఈ సందర్భంగా *బీర్ల ఐలయ్య* గారు మాట్లాడుతూ.గత వానాకాలం,యాసంగి,ధాన్యం 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాములో నిల్వలు ఉండటం వల్ల ఈ కాలం ధాన్యం నిలువ కు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.గతంలో జూన్ 30వరకు కొనుగోళ్లు జరిగేవని,కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం లో అధికారుల చొరవ తో మరో 10రోజుల్లో టార్గెట్ పూర్తి చేస్తూ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతులు ఎవ్వరు ఆధర్యపడవద్దని,ధైర్యంగా ఉండాలని,ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.ప్రతి పక్షాలు అబద్దపు ప్రచారాలు చేసి రోడ్డు ఎక్కుతున్నారని అన్నారు,వరి వేస్తే ఉరి అన్న వారు నిరసన చేయడానికి అనర్హులు అన్నారు.రైతుల రుణమాఫీ కోసం,500రూపాయల బోనస్ ఇవ్వటం కోసం రైతులకు పెద్దపీట కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుందన్నారు.


భువనగిరి లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. గెలుపే లక్ష్యంగా చేసుకొని అందరం పని చేద్దామని కోరారు .కాంగ్రెస్ - బిఆర్ఎస్ పార్టీలు యువతకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి విజయానికి అందరూ కృషి చేయాలని నాయకులను కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వరంగల్ నలగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా మంటి లింగయ్య నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గొల్లెపల్లి గ్రామానికి చెందిన మంటి లింగయ్యను తెలంగాణ ఉద్యమ. కళాకారుల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రమౌళి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంటి లింగయ్య మాట్లాడుతూ నా నియామకానికి సహకరించి నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రమౌళికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులం అనేక ధూంధాములు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి అనేక రకాలుగా నష్టపోయామని ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని ఆయన అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కళాకారులందరూ ఏకం కావలసిన అవసరం ఉందన్నారు.

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా. బీబీనగర్ మండల లో బట్టుగూడెం, చిన్నరావులపల్లి గ్రామాలలో ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం ప్రభుత్వం కొనక పోవడం ,కాంట వేయకపోవడం పైన అధికారులను కలిసి రైతులు లను కలసిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల మార్కెట్ లో ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసానమోర్చా జిల్లా అధ్యక్షులు రాజేందర్ , బీజేపీ మండల అధ్యక్షులు ఎంజమూరి ప్రభాకర్ , జంగారెడ్డి , st మోర్చా నాయకులు రాజు నాయక్ , మండల, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న ను భారీ మెజార్టీతో గెలిపించాలి: తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుద్ధుల సునీత

నల్లగొండ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని *తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుద్ధుల సునీత* పట్ట బధ్రులను కలిసి విజ్ఞప్తి చేశారు *తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో* శనివారం నాడు తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో జరిగిన ప్రచారంలో బాగంగా ఆమె మాట్లాడుతూ కష్ట కాలంలో సామాన్య ప్రజలను విద్యార్థులను అన్ని విధాలా ఆదుకున్న ప్రజా సేవకుడు తీన్మార్ మాల్లన్న అని కొనియాడారు తనకున్న యావదాస్తిని సైతం ప్రభుత్వంకు ఇచ్చిన ఏకైక నాయకుడు మల్లన్న మాత్రమేనన్నారు.

నిరుద్యోగులకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా మాట్లాడి చొరవ తీసుకుంటాడని పేర్కొన్నారు సమస్యలన్నీ పరిష్కారo కావాలంటే పట్ట బద్రులైన విద్యార్థులు,ఉద్యోగులు,ఉపాద్యాయులు, అధ్యాపకులు,ప్రభుత్వ,ప్రయివేటు సoస్థల్లో పనిచేసే పట్ట బద్రులందరూ కలిసి తీన్మార్ మల్లన్నకు ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ దత్తాయపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవరుప్పల మల్లేశం,ఓబీసీ సెల్ జిల్లా కో ఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవరుప్పల బాలయ్య, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గుoటి మల్లేశ్ యాదవ్,దత్తాయపల్లి పాల ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్ జిట్ట కిషన్ యాదవ్,నాయకులు దేవరుప్పల చిన్న ఐలయ్య కొండo వెంకటేశం గౌడ్,ధ్యాన బోయిన రమేష్,ఎర్ర ఐలయ్య,ఆరుట్ల ఉదయ్ రెడ్డి,పట్ట బద్రులు ప్రవీణ్,పవన్ తదితరులు ఉన్నారు.

చౌటుప్పల్ లో ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన వైద్యాధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ప్రైవేట్ ఆసుపత్రులను టాస్క్ఫోర్స్ బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది లింగ నిర్ధారణ సెక్షన్లకు ప్రాధాన్యం ఇచ్చే 8 ఆసుపత్రులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. నెల రోజులలో నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు ఈ తనిఖీలు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యశోద భువనగిరి చౌటుప్పల్ కు చెందిన ప్రభుత్వ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముసిపట్ల లో ప్రమాదవశాత్తు కాలుజారి తాటి చెట్టు పై గీత కార్మికుడు తలకిందులుగా, జెసిబి సహాయంతో కిందికి దించిన స్థానికులు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామంలో శుక్రవారం గీత కార్మికుడు తాటిచెట్టు పై ప్రమాదవశాత్తు తలకిందులుగా అయ్యాడు. స్థానికులు జెసిబి సహాయంతో కిందికి దించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

లోతుకుంట మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపల్ జి రాము

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల నందు 2024 - 25 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్ అడ్మిషన్లకై ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ జి . రాము ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రూపులు 1.ఎంపీసీ 2. బైపిసి 3. ఎంఈసి 4. సిఈసి గ్రూపులలో అడ్మిషన్ల కొరకై వెబ్సైట్ www.tsmodelschools.com లో అప్లై చేయాలని, ప్రతి గ్రూపు నందు 40 సీట్లు ఉన్నాయని అన్నారు. పదవ తరగతిలో సాధించిన GPA ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయని తెలిపారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ 25 - 05- 2024
ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి ,జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ


యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఐకెపి, సొసైటీ కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం స్థానిక శాసనసభ్యులు తగిన విధంగా స్పందించి వడ్లును కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా బాధ్యత తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేసినారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి మండలం ఐకెపి (వడ్ల కొనుగోలు కేంద్రం) ని సందర్శించిన అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతూ భువనగిరి మండల తహిశీల్దార్ అంజిరెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఆరు కాలము కష్టపడి కరువులో బోరుబావులు అడగండి సగం చేండ్లు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలతో ఉన్న కాస్త పండిన పంటను కోసి ధాన్యాన్ని మార్కెట్ కు తెచ్చి 60 రోజులు గడుస్తున్న సరిగా కొనుగోలు చేయక వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే నాధుడే కరువయ్యాడని నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. గత పాలకులు రైతులను ఇబ్బంది పెడితే నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని అనేక మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని సరిగా కొనటం లేదని ప్రశ్నించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే జిల్లా కలెక్టర్ యంత్రాంగం, ఓట్లు వేసుకుని గద్దెనెక్కిన శాసనసభ్యులు ఎందుకు మార్కెట్లను సందర్శించి రైతుల బాధలను తీర్చడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని మార్కెట్ కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లారీల కొరతను, గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని, తరుగు పేరుతో క్వింటాకు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దానిని అరికట్టాలని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు రైతుల బాధలు పట్టించుకోని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని నర్సింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య , అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుంట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొల్లెపల్లి కుమార్, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్ , కొండాపురం యాదగిరి, అనాజపురం శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేష్, నాయకులు గంగనబోయిన బాల నరసింహ, బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, కడారి కృష్ణ , పిట్టల శ్రీశైలం, కడ మంచి రవి, అంజయ్య , రైతులు శ్రీరామ్ శ్రీశైలం , పున్నమ్మ, యాదయ్య, పోషయ్య తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

ఈ నెల 27వ తేది రోజు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి జిల్లా కేంద్రం లోని ప్రయివేట్ పాఠశాల ల యాజమాన్యం ట్రస్మా జిల్లా అధ్యక్షులు జలందర్ రెడ్డి ని కలిసి కోరడం జరిగింది. అదేవిదంగా సాయి కృప డిగ్రీ కాలేజీ లో ప్రిన్సిపాల్ యాకుబ్ మరియు లెక్చరర్ లను కలిసి మల్లన్న కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేటు మెంబెర్ తంగెల్లపల్లి రవి కుమార్, కౌన్సిలర్ సలాఉద్దీన్, నాయకులు అతహర్, గుమిడెల్లి రమేష్, రంజిత్, యువ న్యాయవాది ఎడమ ప్రవీన్, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.