ఉద్యోగులకు 7 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాంపు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలక్క
వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ రిలీఫ్ కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయం పన్ను విధానం ప్రకటిం చారు.
ఇంతకుముందు పాత ఆదాయం పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50 వేల వరకు మినహాయింపు ఉండేది. దాన్ని రూ.25 వేల వరకు పొడిగించారు. అంటే రూ.2.50 లక్షల నుంచి రూ.3.25 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
ఇక కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్ను రాయితీ అమలవుతుంది. కార్పొరేట్ సంస్థల ఆదాయంలో పన్ను చెల్లింపు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపులు యథాతథం
ఇక ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుల విధానం యథాతథంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.23.24 లక్షల కోట్ల ఆదాయం లభించిందన్నారు.
ఎగుమతి, దిగుమతి సుంకాల విధానం యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు...
Feb 01 2024, 19:24