/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz టీఎస్ పిఎస్పీ సభ్యులుగా ఐదుగురి నియామకం Yadagiri Goud
టీఎస్ పిఎస్పీ సభ్యులుగా ఐదుగురి నియామకం

కొద్దిసేపటి క్రితం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని గవర్నర్ తమిళిసై నియమించారు.

తాజాగా సభ్యుల నియామకానికి కూడా ఆమె ఆమోదం తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావును సభ్యులుగా నియమించారు...

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు..

ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ ఈరోజు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి "జై భారత్ నేషనల్ పార్టీ" మేనిఫెస్టో ప్ర‌క‌టించింది.

ఆ పార్టీ అధ్య‌క్షుడు జేడీ లక్ష్మీనారాయణ గురువారం మేనిఫెస్టోను విడుద‌ల చేశారు.

రైతులకు ప్రతి నెలా రూ.5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి రూ.15వేల నష్టపరిహారం ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు వంటి హామీల‌ను మేనిఫెస్టోలో పేర్కొన్నారు...

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు రేపే ఆఖరి రోజు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 119 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది.

జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 26, 2024 వరకు AAI అధికారిక వెబ్‌సైట్ https://aai.aero/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

ఫిబ్రవరి 8న ఫైనల్ ఓటర్ జాబితా విడుదల చేస్తాం: వికాస్ రాజ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించ నున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించు కోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్‌ చేశారు.

ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో నేషనల్‌ ఓటర్స్‌ డే సందర్భంగా సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ జనరల్‌ ఎలక్షన్స్‌ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్‌ విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుత‌న్నాం…

ఇందులో కూడా విజ‌యం సాధిస్తాం.. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.. ఇక తెలంగాణాలో తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు.

గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపం: మంత్రి శ్రీధర్‌బాబు

గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

గురువారం హైదరా బాద్‌లోని హోటల్‌ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రారియల్‌ ఎస్టేట్‌ సదస్సులో మాట్లాడారు.

రాష్ట్ర ప్రగతే తమ విజన్‌ అన్నారు. 3 దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో పుంజుకుందన్నారు.

దావోస్‌ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించా మని, విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామిక వేత్తల సహకారం అవసరం అని అన్నారు.

కేటీఆరూ... బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్: సీతక్క

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు మైండ్‌ బ్లాకైందని విమర్శలు గుప్పించారు.

తమ అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైందని దుయ్య బట్టారు. అధికారం లేకుండా కేటీఆర్‌ ఉండలేకపోతు న్నారని, అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని గురువారం మంత్రి సీతక్క దర్శించు కున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లు గడీల పాలన చేసిందని విమర్శించారు.

ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు కేటీఆర్‌కు బుద్దుందా అని ప్రశ్నించిన సీతక్క ఆయన కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

ప్రజలు మావైపే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు..? గత ప్రభుత్వం కాదా..?అని సీతక్క ప్రశ్నించారు.

మేము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారు. చేయకపోతే అవకాశం ఇవ్వరు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్. ప్రజలు గుర్తిస్తారు. లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారు.

రాజన్న మా ఇలా వేల్పు. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆదివాసీ కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురైంది. మా ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తాం.’ అని సీతక్క పేర్కొన్నారు.

Nara Lokesh.. 'జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్': నారా లోకేష్

ఆమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని... వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు..

ఓడినా విచారం లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ ఇక ఉండరని.. ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

'హ్యాపీగా దిగిపోతా.. ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ' పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తను లోకేష్ షేర్ చేశారు. '56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా.

ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా' అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్టు ఈ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది..

Police Medals: 1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల (Police Medals)ను ప్రకటించింది..

దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను విడుదల చేసింది.

ఇందులో 275 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి పోలీస్‌ విశిష్ఠ సేవా (మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పతకాలను ప్రకటించింది.

గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్‌ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 26, ఝార్ఖండ్‌ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్‌నుంచి 65, సశస్త్ర సీమాబల్‌ నుంచి 21 మంది ఈ పతకాలు అందుకోనున్నారు. లెఫ్ట్‌ వింగ్‌ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 119 మంది, జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న 133 మందికి ఈ మెడల్స్‌ దక్కాయి.

తెలుగు రాష్ట్రాల వారికి ఇలా..

ఈ పురస్కారాల్లో తెలంగాణ నుంచి 20, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 9 మందికి పతకాలు దక్కాయి. ఏపీలో 9 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 12 మంది పోలీసు విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. తెలంగాణ అదనపు డీజీపీలు సౌమ్యా మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై కేసు.. సీఐడీకి బదిలీ

గువాహటి: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అస్సాంలో నిర్వహించిన 'భారత్‌ జోడో న్యాయ యాత్ర'లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే..

దీంతో రాహుల్‌ సహా ఇతర నేతలపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీన్ని సీఐడీ (CID)కి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర డీజీ వెల్లడించారు..

ఇటీవల రాహుల్‌ యాత్ర గువాహటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ట్రాఫిక్‌ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అందుకు బదులుగా బైపాస్‌ నుంచి వెళ్లాలని సూచించింది.

ఈ క్రమంలోనే యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే, కాంగ్రెస్‌ కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.

సమూహాన్ని రాహుల్‌ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్‌ ఉద్దేశమని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీని అరెస్టు చేస్తామని సీఎం పేర్కొన్నారు..