గడ్చిరోలి నదిలో పడవ బోల్తా పడి ఆరుగురు గల్లంతు
మహారాష్ట్రలో మంగళవారం సాయంత్రం తీవ్ర విషాదం నెలకొంది.
వైనగంగా నదిలో పడవ బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు మహిళలు గల్లంతు కాగా ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం అయ్యాయి.
చాముర్సి తాలుక ఘణపూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరప పంటలో ఏరివేత కు వెళ్తుంటారు. గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగాపూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
7 గురు వ్యవసాయ కూలీలు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.అయితే ఈదుకుంటూ ఒక్క మహిళను ఒడ్డుకు చేర్చాడు పడవ నడుపుతున్న వ్యక్తి.
ఇక మరో 6 గురు గల్లంతు అయ్యారు. ఇందులో జీజాబాయి రౌతు(55), పుష్ప జాడే(42) మృత దేహాలను బయటకు తీసింది రెస్క్యూ టీం. గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే ఎందుకు ప్రమాదం జరిగింది? సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణి కులు ఎక్కించుకోవడం వల్లనే పడవ బోల్తా కొట్టిందా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Jan 24 2024, 12:14