/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png
నేడు తిరుపతిలో సిఎం జగన్ పర్యటన
ఇవాళ సిఎం జగన్ పర్యటన తిరుపతిలో పర్యటించానున్నారు. అక్కడ ఓ సమ్మిట్ కు సీఎం జగన్ పాల్గొననున్నారు.
ఈ మేరకు మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి తిరుపతి కి బయలుదేర నున్నారు.
నేడు విశాఖ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన
నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించానున్నారు.
ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంతో సమావేశం నిర్వహించ నున్నారు.షర్మిల సమక్షంలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ ఛైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డిపార్టీలో చేరనున్నారు.
మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్ పాల్గొంటారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.
సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి సంఘీభావం షర్మిలప్రకటించనుంది...
ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు
ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది.
అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5లక్షల మంజూరు (ఇందిరమ్మ ఇంటి పథకం) పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.
ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.
అందులో భాగంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని మూడు పథకాలను ప్రజల కు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.
దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఉండగా దానిని ఎలా అమలు చేయా లి, ముందుగా ఎంతమంది లబ్ధిదారులకు వాటిని అందచేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలిసింది.
ఈ పథకాలకు సంబంధించి విధి, విధానాలను కూడా త్వరలో ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
ఏప్రిల్ తరువాత మహిళలకు రూ.2500లు..!
గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను తీసుకోగా, ప్రస్తుతం ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో దాని స్థానంలో ఇందిరమ్మ పథకం కింద అర్హులకు రూ.5లక్షలను ఇవ్వాలని నిర్ణయించి నట్టుగా తెలిసింది.
అయితే మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ.2500లను వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానిని ఏప్రిల్ తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం
నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది.
రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు.
అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా తీయ నుంది. భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను కమిటీ ధరణి కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు...
నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం
నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ జారీ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
6 జిల్లాల్లో పాస్‌పోర్ట్ బ్రోకర్‌ని సీఐడీ అరెస్ట్ చేసింది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్‌పోర్ట్ పొందినట్లు సీఐడీ గుర్తించింది. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్‌పోర్ట్ ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు.
నకిలీ పాస్‌పోర్ట్‌లతో కొంత మందికి వీసాలను జారీ చేశారు.వీసాల్లో కెనెడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తమున్నట్టు విచారణలో వెల్లడైంది.
పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. పలువురు పాస్‌పోర్ట్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేపట్టారు.
తైక్వాండో ప్రీమియర్ లీగ్ క్రీడలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
మంగళవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ప్రీమియర్ లీగ్ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
తైక్వాండో దుస్తులు ధరించి.. క్రీడాకారులతో సరదాగా పోటీపడి వారిలో ప్రోత్సాహాన్ని నింపారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన క్రీడా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డివెంకట్ రెడ్డి తెలిపారు...
మిజోరాం లో సైనిక విమానానికి ప్రమాదం: 8 మంది గాయాలు
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఉదయం 10:19 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది.
మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి, రన్‌వేపై స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు.
బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితం సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడి తమ దేశ సైనికులను వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చింది.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 13 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.భారత్‌లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్న విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా మయన్మార్‌లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య అంతర్యుద్ధం జరగుతున్నది. దీంతో ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరానికి వస్తున్నారు.
ఇలా గతవారం దేశంలోకి చొరబడిన 276 మంది సైనికుల్లో 184 మందిని తిరిగి మయన్మార్‌కు పంపినట్లు అస్సామ్ రైఫిల్స్ కు చెందిన అధికారులు వెల్లడించారు.
మిగిలిన 92 మందిని నేడు పంపనున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 635 మంది మయన్మార్ సైనికులు భారత్‌లోకి చొరబడ్డారు...
పొరుగింటి వారు తిట్టారని యువతి ఆత్మహత్య
మనస్థాపంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మద్దుల గూడెం గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన పర్శిక శైలజ (19) నర్సింగ్ చదువుతుంది.శైలజను తమ ఇంటి పొరుగు వారైన మహిళలు తిట్టారనే నెపంతో మనస్థాపానికి గురై అవమానం తట్టుకోలేక ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి మృతిచెందింది.
ఈ ఘటనపై మృతురాలి తల్లి ఏడూళ్ళ బయ్యారం పోలీసు స్టేషను లో పిర్యాదు చేసినట్లు సమాచారం..
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది.
దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Jan 24 2024, 12:12