ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే
సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ సర్కార్‌లను నిలదీస్తోంది
కాషాయ పార్టీ. దేశంలో చాలా రాష్ట్రాలు ఎల్లుండి హాలీ డే ఇచ్చాయి. ఆ హోలీ డే గురించి మీకు పట్టదా, రాముడంటే లెక్కలేదా అంటోంది కమలం పార్టీ. 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించకపోతే సమరమే అంటోంది. రాజకీయ పార్టీలన్నాక పోరాటం చేస్తాయి.
అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పోరాటం చేస్తోంది బీజేపీ. సమస్యల గురించి కాకుండా సెలవుల కోసం యుద్ధం ప్రకటించింది. అయితే అది స్టూడెంట్స్ కోసం కాదు. రామ భక్తుల కోసం.. ఏపీ, తెలంగాణ సర్కార్‌లపై సమరానికి సై అంటూ సీరియస్ అవుతోంది.
ఈ నెల 22న అయోధ్య లోని దివ్య భవ్య నవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టతో కొలువుదీరను న్నాడు బాల రామయ్య. దీంతో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ డిమాండ్ చేస్తోంది.
కొన్ని రాష్ట్రాల్లో సెలవు దినం.ప్రకటించింది. ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు.
అయితే ఆ హోలీ డే నాడు తెలుగు రాష్ట్రాలు హాలీ డే ప్రకటించవా అంటూ బీజేపీ నేతలు మండిపడుతు న్నారు. తెలుగు రాష్ట్రాల్లో 22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలని ఆయా ప్రభుత్వాలను కోరుతోంది కాషాయ పార్టీ.
సమయం లేదు మిత్రమా సెలవు ఇస్తారా, సమరం ప్రకటించమంటారా అంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తోంది, బిజెపి పార్టీ...
Jan 20 2024, 17:10