థేమ్స్ తరహాలో మూసినది అభివృద్ధి
రుజ్జీవన ప్రణాళికలపై లండన్‌లో థేమ్స్ రివర్ పాలక మండలితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చలు జరిపారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు.
లండన్‌లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు.
దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడికా ర్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ సిఎంకు వివరించారు.
అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలను ఈ సందర్భంగా వారు చర్చించారు.
విజన్ 2050’కు అనుగుణంగా ప్రాజెక్టు
అక్కడి ‘నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయి.
హైదరాబాద్ సిటీకి అటువంటి ప్రత్యేకత ఉంది. అటు మూసీ నది వెంబడి, ఇటు హుస్సేన్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్ వై భవం తీసుకు వస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా భావించారు..
Jan 20 2024, 10:04