హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు
హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది.
రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగనున్న దృష్ట్యా నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు ఈ కరెంటు కోతలు విధిస్తున్నట్లు పేర్కొంది.
వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్న దృష్ట్యా డిమాండ్ ను తట్టుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పవర్ లైన్లు, సబ్ స్టేషన్లలో రొటేషన్ పద్ధతిలో నిర్వహణ, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు టిఎస్ఎస్ పిడిసిఎల్ తెలిపింది.
ఏయే ప్రాంతాల్లో ఏ రోజు కరెంటు కోత అమలవు తుందో తెలుసుకునేందుకు టిఎస్ఎస్ పిడిసిఎల్ వెబ్ సైట్ ను చూడవచ్చు.
కరెంటు కోతలవల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ పేర్కొన్నారు.
నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి, అవసరమైతే కొత్త విద్యుత్ లైన్లు వేస్తామని ఆయన వివరించారు.
ఒక్కొ ఫీడర్ కు ఒక్కొ రోజు మాత్రమే కరెంటు కోతలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
Jan 18 2024, 14:48