ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన కవిత విచార ణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు.
ఇదే విషయంలో సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని.. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు తాను విచారణకు హాజరుకాకూడ దని నిర్ణయించుకున్నట్లు లేఖలో తెలిపారు. గతంలో మూడు సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
మహిళలను ఇంటి దగ్గర లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే గతేడాది మార్చి లోనే కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు పలుమార్లు విచారించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్‌కు సంబంధిం చిన వ్యవహారాల్లో కవిత లీడ్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కవిత విచారణకు రానని తేల్చిచెప్పడంతో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా లేక విచారణకు రావాల్సిందేనని మరోసారి నోటీసులు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది...
Jan 16 2024, 12:38