సాంప్రదాయ ముసుగులో కోడి పందాలు- జూదం
సంక్రాంతి పండుగ సందడి మొదలైంది.ఈ పండక్కి ప్రతీ యేట సాగే పందాలు మొదలయ్యాయి. ఓ వైపు కోడి పందాలు.. మరోవైపు పేకాట శిబిరాలు వెలిశాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కోడి పందాల్లో పాల్గొని కత్తి కట్టేందుకు ఎంట్రీ ఫీజు సైతం ఏర్పాటు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది.
భూపాలపల్లి జిల్లా మండలలలో పేరున్న వక్తులు దళారుల అవతార మెత్తారు. అన్నీ తాము చూసుకుంటా మంటూ భరోసా ఇస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు బహిరంగంగా చర్చ సాగుతోంది.
కోడిపందాలతో హోరెత్తుతున్న పల్లెలు
సంక్రాంతి వచ్చిందంటే పట్టణాల్లో నివాసముండే వారంతా పల్లెలకు చేరుకుంటారు. సరదా, టైంపాస్ కోసం ఆరాట పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ యేట మాదిరిగానే పేకాట, కోడి పందాలాట సాగుతున్నట్లు తెలుస్తుంది.వీటి నిర్వహణ కోసం ఇప్ప టికే జిల్లాలోని ఆయా గ్రామాల శివారు ప్రాంతాలు, రహస్య ప్రదేశాలను పందెం రాయుళ్లు ఎంచుకొని సిద్ధం చేసుకున్నారు.
పందెంలో పాల్గొనే వారు వేరే వ్యక్తులకు ఆ సమా చారాన్ని ఇవ్వకుండా రహస్యంగా పరుగులు తీస్తున్నట్లు తెలిసింది. గతంలో ఆడే ప్రదేశాలతో పాటు కొత్తగా మరికొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకొని మకాం మార్చి పందాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
కోడి పందాల్లో పాల్గొని కత్తి కట్టేందుకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొత్త తరహా పందా లకు కొంత మంది తెర తీసినట్లు ప్రచారం జరుగు తోంది. ఎంట్రీ ఫీజు రూ.200 నుంచి పోటీ అధికంగా ఉండే చోట రూ.500 ఫీజు ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
ప్రధానంగా కాటారం సబ్‌డివిజన్ పరిధిలోని మారుమూల పల్లెల్లో ఈ తతంగం సాగుతున్నట్లు సమాచారం. దళారులుగా రంగంలోకి దిగిన వ్యక్తులు పోలీసులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామనే హామీతో డబ్బులు దండుకుంటున్నట్లు సమాచారం.
అలాగే, పోటీల్లో ఉన్న వారు రూ.1000తో మొదలు పెట్టి రూ.20వేల వరకు కూడా బెట్టింగ్ పెట్టేందుకు వెను కాడటం లేనట్లుగా తెలిసింది. మరోవైపు కోడిపందాల సమీప దూరంలోనే పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి.. లోన బయట పోటీ జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం.
పేకాట సైతం రూ.10వేలకు పైనే సాగుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఏదైనా ఓ గ్రామంలో పోటీల నిర్వహణ ఉందంటే ఆయా చుట్టు పక్కల గ్రామాల పందెం రాయుళ్లు పోటీ పడి పందెంలో పాల్గొంటున్నట్లు తెలిసింది.
ఇతర సుదూర ప్రాంతాల నుంచి పందెం కోళ్లను రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పెట్టి కొనుగోలు చేసి పోటీలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది....
Jan 14 2024, 10:38