నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యం లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది.
నిరుద్యోగిత, ధరల పెరుగుదల, సామాజిక న్యా యం వంటి సమస్యలపై ప్రధానం గా దృష్టి సారిస్తూ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ యాత్రకు ఉపక్రమించడం పార్టీ యత్నం.
భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాలలో 100 లోక్‌సభ సెగ్మెంట్ల మీదుగా సాగుతుంది. రాహుల్ గాంధీ గతంలో దేశవ్యాప్తంగా సాగించిన యాత్ర మాదిరిగా ఇది ‘పరివర్తన’ యాత్రగా భాసిస్తుందని పార్టీ విశ్వసిస్తున్నది.
పార్లమెంట్‌లో ప్రజల సమస్యల ప్రస్తావనకు ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వనందున భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఉపక్రమి స్తున్నామని కాంగ్రెస్ వివరిం చింది. రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సిద్ధాంతా లను తిరిగి నెలకొల్పడం తమ యాత్ర లక్షమని పార్టీ తెలియ జేసింది.
ఇది ఎన్నికల యాత్ర కాదని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తమ పేలవ ప్రదర్శన దరిమిలా తమ భవిష్యత్తు మెరుగుదలను కోరుతున్నా మని పార్టీ స్పష్టం చేసింది.
ఈ నెల 22 నాటి రామ మందిరం ప్రతిష్ఠాపనపై బిజెపి దృష్టి కేంద్రీకరిస్తుం డడంతో ఈ యాత్ర ద్వారా జీవనోపాధి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది.
మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల అన్యాయ్ కాల్’పై యాత్ర
భారత్ జోడో న్యాయ్ యాత్ర సైద్ధాంతిక యాత్ర అని, ఎన్నికల్లో ఓట్ల సముపార్జన కోసం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వ పది సంవత్సరాల ‘అన్యాయ్ కాల్’కు వ్యతిరేకంగా యాత్ర చేపడుతున్నామని పార్టీ తెలిపింది.
Jan 14 2024, 10:34