ప్రజాసేవకే నా జీవితం అంకితం ... నన్ను వదిలిపెట్టకండి ...!
- మంత్రి పొన్నం ప్రభాకర్ భావోద్వేగం
ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను క్రిబ్కో ఛైర్మన్ బీరేంద్ర సింగ్, ఢిల్లీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ అనితా రావత్ సన్మానించారు. ఈ క్రమంలో.. ఆనాటి జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగిందని పొన్నం చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యానని తనను ఒదిలేయొద్దని.. తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెం ఎమోషనల్ అయ్యారు.అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాననని.. ఐదేళ్లు ఛైర్మన్‌గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. క్రిబ్కో ప్రోత్సాహం వల్ల ఎంతో ఎదిగానన్నారు. క్రిబ్కో, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 7 వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు.
నిన్ననే లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చా. అందరి కంటే చిన్న వయసులో కో ఆపరేటివ్‌గా పని చేశా. మీ అందరి ప్రేమను పొందాను. మీ ప్రేమ అభినమనాలు నా జీవితంలో మర్చిపోను. ఈసారి మంత్రి అయ్యాను. ఢిల్లీకి రాజయిన తల్లికి కొడుకే కాబట్టి.. మంత్రినయినా మీకు మాత్రం చిన్నోడినే. మీ ప్రేమ అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్న. మంత్రి అయ్యానని నన్ను ఒదిలేయకండి.. నేను మీ తమ్ముడిని. విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన నా ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది." అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Jan 13 2024, 19:51