/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్ Yadagiri Goud
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్

జగిత్యాల జిల్లాలో రోడ్డు సోమవారం సాయంత్రం ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెల రేగాయి. మెట్ పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలా నికి చేరుకొని మంటలను ఆర్పేందుకు శ్రమించారు.

ఈ ప్రమాదంతో హైవేపై వాహనాలు కొద్దిసేపు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి

Nara Bhuvaneswari: నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

కర్నూలు : నేడు,రేపు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది.

నేడు ఆమె ఆదోని,మంత్రాలయం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు..

రేపు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించి.. అక్కడ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు..

Reventh Reddy: రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా రెండవ రోజు మంగళవారం సమీక్షలు జరపనున్నారు.

ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమీక్షలు నిర్వహించనున్నారు..

ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో ఆయన సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు జిల్లాల ఇంచార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు..

సీఈసీ బృందంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచండి..

టిడిపి, జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా సీఈసీ బృందంతో భేటీ కానున్నారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు..

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, ఎన్నికల ఏర్పాట్లపై లోపాలు రాష్ట్రవ్యాప్తంగా జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాల మీద ఫిర్యాదులు చేయనున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ముఖ్యంగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు..

ప్రజాపాలనకు కేబినెట్ సబ్ కమిటీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది.

అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రజా పాలన హామీలను పకడ్భందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నలుగురితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్‌గా నియమించింది.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కమిటీ సభ్యులుగా అపా యింట్ చేసింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీల హామీ ఇచ్చింది.

ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆరు గ్యారెంటీ ల్లోని సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటిల్లో డిసెంబర్ 28వ తేదీన నుండి అప్లికేషన్లు స్వీకరించింది.

ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 28వ తేదీ నుండి.. జనవరి 6వ తేదీ వరకు సాగిన దరఖాస్తు ల స్వీకరణలో దాదాపు ఒక కోటి 25 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

దరఖాస్తుల స్వీకరణ ముగి యడంతో అధికారులు లబ్ధి దారుల ఎంపిక ప్రాసెస్ చేపట్టారు.

YCP: బైరెడ్డి సిద్ధార్థ్‌కు కీలక బాధ్యతలు కట్టబెడుతున్న సీఎం జగన్..!!

అమరావతి: వైసీపీలో నియోజకవర్గాల ఇంచార్జీల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు జాబితాలను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. మూడో జాబితా కోసం సన్నాహాలు జరిగింది..

ఇందులో భాగంగా.. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వెళ్లింది. తాజాగా నందికొట్కురు, మార్కాపురం, విజయనగరం, కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిల నియమానికి సంబంధించి ఆయా నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(AP CM ?YS Jagan) సోమవారం చర్చలు నిర్వహించారు.

నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి మార్పుపై సీఎం కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డికి (Byreddy Siddarth Reddy) సీఎంవో నుంచి పిలుపు వెళ్లింది. దీంతో సోమవారం బైరెడ్డి సీఎంవోకు చేరుకుని ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Arthur) అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే బైరెడ్డి ఎవర్ని నిలబెట్టినా జగన్ ఓకే అనే పరిస్థితి ఉందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే.. బైరెడ్డికి జగన్ రెడ్డి కీలక బాధ్యతలే కట్టబెట్టబోతున్నారట.

వరుస సమావేశాలు..!

అటు మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై సీఎం కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి (MLA Nagarjuna Reddy), జల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిలకు (Jamke Venkatreddy) పిలుపు వెళ్లడంతో ఇరువురు నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఇరువురు నేతలో సీఎం చర్చలు చేపట్టారు.

అలాగే విజయనగరం పార్లమెంట్ ఇంచార్జి నియామకంపై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో (MP Bellana Chandrashekar) సీఎం జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) పాల్గొన్నారు. మరోవైపు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి నియామకానికి సంబంధించి డోన్ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని (Minister Buggana Rajendranath reddy) సీఎం జగన్ సీఎంవోకి పిలిపించినట్లు తెలుస్తోంది.

అసంతృప్తులు అందరూ రండి..!

అంతకుముందు.. వైసీపీ పెద్దల పిలుపుమేరకు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మరోసారి తాడేపల్లి సీఎం కార్యాలయానికి వచ్చారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు కూడా సీఎంవోకు చేరుకున్నారు. వీరితో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడేపల్లికి వచ్చారు. పార్టీలో జరిగే పరిణామాలపై ఇటీవలే బహిరంగంగానే డొక్కా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనకు సీఎం ను కలిసేందుకు అవకాశం కల్పించడం లేదనే అసంతృప్తితో డొక్కా ఉన్నారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించాలని బహిరంగ సభలో నేతలను డొక్కా కోరారు. ఈ క్రమంలో అధిష్టానం పిలుపు మేరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

ముందుగా నేతలతో సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సమావేశమవుతున్నారు. సర్వే నివేదికలు, మార్పుల విషయాన్ని నేతలతో సజ్జల, ధనుంజయ్ రెడ్డి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి, అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలు, నేతలతోనే కలిసేందుకు సీఎం వైఎస్ జగన్ అనుమతిస్తోన్నట్లు సమాచారం.

చట్టసభల్లో మహిళల వాటా సాధిద్దాం ఐద్వా

•జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ టౌన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఐద్వా రాష్ట్ర పిలుపుమేరకు ఒకరోజు సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రాజకీయ కుట్రను ఎదిరిస్తాం.

పోరాటాల ద్వారా హక్కులను సాధించుకొని అన్ని రంగాలలో ముందుకు వస్తుంటే, ఏదో ఒక రకంగా మహిళలను అనేక రూపాలలో కులం మతం పేరుతో అనగదొక్కటానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. వాటిని ఎదుర్కొనటానికి మహిళలు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ సాధించుకోవాలన్నరు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంతోషకరమైన విషయం కానీ, ఆరు మూల మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు ఈ అవకాశం అందటం లేదు.

అలాగే మహిళలకు అన్ని బస్సుల్లో కూడా అవకాశం కల్పిస్తే ఉంటుందన్నారు. అలాగే మిగతా అన్ని పథకాలు ప్రభుత్వం వెంటనే అమలుపరచాలన్నారు. ఈ సభ్యత్వం లో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ అలాగే పెరిగిన నిత్యవసర ధరల గురించి నిరసనలు ధర్నాలు చేస్తుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల పద్మ భూతం అరుణకుమారి పాల్గొన్నారు.

దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారుల ఆందోళన

నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన దళిత బంధు ను గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగారు.

గ్రౌండింగ్‌ ప్రక్రియను చేప ట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సాధన సమితి సభ్యులు తెలిపారు. ధర్నాకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. లేదంటే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఆయన వెంట స్థానిక బీఆర్‌స్‌ నేతలు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.....

Mavoist: బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

వరంగల్ : ఏటూరునాగారం బైరి నరేష్‌పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు..

భీమకోరేగాం స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిపే సభకు హాజరైన బైరి నరేష్ పై బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు దాడి చేయడం అప్రజాస్వామికమని లేఖలో పేర్కొన్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి, దాడికి గురైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.

ఇప్పటికైనా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని లేఖలో మావోలు డిమాండ్ చేశారు. పూజారి రాధాకృష్ణ సహా నాస్తికవాదులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది..

పార్లమెంటు ఎన్నికలకు ఇన్చార్జిలను నియమించిన బిజెపి అధిష్టానం

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ చార్జులను నియమించింది.

ఈ మేరకు పార్టీ అధిష్టానం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదిలాబాద్‌కు పాయల్ శంకర్,

పెద్దపల్లి - రామారావు పటేల్,

కరీంనగర్‌ - ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా,

నిజామాబాద్‌ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి,

జహీరాబాద్‌ - కాటిపల్లి వెంకటరమణారెడ్డి,

మెదక్‌ - హరీష్ బాబు,

మల్కాజ్‌గిరి - పైడి రాకేశ్ రెడ్డి,

సికింద్రాబాద్ - డాక్టర్‌ కే.లక్ష్మణ్‌,

హైదరాబాద్‌ - రాజాసింగ్,

చేవెళ్ల - వెంకట నారాయణ రెడ్డి,

మహబూబ్‌నగర్ - రామచందర్ రావు,

నాగర్‌కర్నూలు - రంగారెడ్డి,

నల్లగొండ - చింతల రామచంద్రా రెడ్డి,

భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,

వరంగల్‌ - మర్రి శశిధర్ రెడ్డి,

మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు,

ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

కాగా, పార్టీ కీలక నేతలైనా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం.