మట్టి గాజులు ఆడవారికి అందమే కాదు ఆరోగ్యం
తెలంగాణలో ఈ సంస్కృతి, అసాధారణం. అపూర్వం. వర్ణనాతీతం. తన కడుపున పుట్టిన బిడ్డ శ్రేయస్సు, క్షేమం ప్రతీ తల్లికి ముఖ్యం. తన బిడ్డ చక్కగా ఎదగాలి. ఎల్లవేళలా చల్లగా ఉండాలి. ఎలాంటి కీడు దాపురించ కూడదు. మారాజు యోగ్య తతో మనుగడ సాధించాలి. ఇందుకు మంచి మట్టి గాజులు ధరించాలి.
అదీ సొంత డబ్బుతో కాదు. ఇద్దరు మగ బిడ్డల తల్లి నుంచి ఒకే ఒక కొడుకు, లేదా కూతురున్న తల్లి, నజరానా తీసుకోవాలి. ఆ డబ్బులతో గాజులు కొనాలి. తాను ధరించాలి. ఇలా గాజులు కొనుక్కోవటానికి డబ్బులు అడిగే తల్లికి తప్పని సరిగా.. ఆమె వారసత్వం కోసమే కాదు.. తన వారసత్వ క్షేమం కోసమూ మహిళా మూర్తులు గాజుల మామూళ్లు ఇస్తారు.
అంతే కాదు, ఉత్తరాయణ సంక్రమణ దశలో,, మకర సంక్రాంతి సందర్భంగా ఆ సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. కృతజ్ఙతలు తెలుపుతారు. ఇక మహావిష్ణువు, శ్రీ లక్ష్మీని పూజిస్తారు.
అందరూ క్షేమంగా ఉండాలి. అందరిలో మేమూ ఉండా లనే నానుడి.. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ మహిళల్లో విస్పష్టం.
తెలంగాణ సంస్కృతిలో,, మహిళలు ప్రాణ సమానం గా గాజులను ఆరాధిస్తారు. డబ్బున్న మారాణులైతే వజ్రాల గాజలతో ఫోజి స్తారు. ఎన్నో రంగుల రంగుల గాజులు ధరిం చటానికే ఇష్టపడ తారు.
ధనవంతులు బంగారు గాజులు ధరించవచ్చు. కానీ ఎల్లవేళలా రంగు రంగుల గాజులకు ఇచ్చే విలువ, గౌరవం బంగారు గాజులకు దక్కదంటే ఆశ్చర్యపోనక్క రలేదు. మట్టి గాజులంటే ఆడబిడ్డలు అల్లాడి పోతుంటారు. .
బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా.. మళ్లీ ఇంకో డజన్ గాజులు తీసుకుం మని మధ్యతరగతి మహిళ భావిస్తుంది. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్ గాజులు కొంటుంది. కానీ మట్టి గాజులకే అపూర్వ గౌరవం లభిస్తుంది.
Jan 08 2024, 12:07