/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Chandrababu: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతోంది: చంద్రబాబు Yadagiri Goud
Chandrababu: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతోంది: చంద్రబాబు

తిరువూరు: వైకాపా ప్రభుత్వ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి పోయిందని.. మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్‌ (YS Jagan) దెబ్బతీశారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు..

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో నిర్వహించిన 'రా.. కదలి రా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

''ఓ పక్క హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. మరో పక్క అమరావతి వెలవెలబోతోంది. దీనికి కారణం జగన్‌ రివర్స్‌ పాలన. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం.. ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు నష్టం కలుగుతుంది. దుర్మార్గుడి పాలనలో రాష్ట్రంలో తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ రాష్ట్రంలో నాతో సహా అందరూ బాధితులే. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నా..

మూడు నెలల్లో రైతు రాజ్యం

ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలనేది నా ఆకాంక్ష. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుంది. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు తెదేపా ఉపయోగపడింది. వైకాపాకు ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్లవుతుంది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేశారు.. ధాన్యం రైతులు దగాపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రైతుల బతుకులు బాగుపడాలంటే తెదేపా-జనసేన ప్రభుత్వం రావాలి. సైతాన్‌ ప్రభుత్వం పోవాలి.. రైతే రాజుగా మారాలి. మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుంది..

మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొంటారు..

ఐదేళ్లు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. రుషికొండను బోడిగుండు చేసి రూ.500కోట్లతో ప్యాలెస్‌ కట్టారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుంది. మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుంది. తెదేపా హయాంలో ఉద్యోగాలు వస్తే.. జగన్‌ గంజాయి తెచ్చారు. యువతను మత్తులో ఉంచి ఏమైనా చేయాలనుకుంటున్నారు. మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తా. రాష్ట్రంలోని యువతను ప్రపంచంలో నంబర్‌ వన్‌గా మారుస్తా.

త్వరలో తెదేపా-జనసేన మేనిఫెస్టో

దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామని వైకాపా నేతలు అనుకుంటున్నారు. ఆ పార్టీ ఆటలు సాగవని గుర్తుంచుకోవాలి. సంక్షేమ పథకాలకు నాంది పలికింది తెదేపా. జగన్‌ పాలనలో వంద పథకాలను రద్దు చేశారు. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని ప్రజలు భావిస్తున్నారు. 'బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ' పేరిట సూపర్‌ సిక్స్‌ అందిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి అందిస్తాం. 'అన్నదాత' కింద రైతులకు రూ.20వేలు అందజేస్తాం. 'జయహో బీసీ' కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తాం. తెదేపా-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం.

అంబటి రాయుడును మోసగించారు

సొంత పార్టీ ఎమ్మెల్యేలను జగన్‌ నమ్మడం లేదు.. ప్రజలు ఆయన్ను నమ్మట్లేదు. ఎమ్మెల్యేలను బదిలీ చేసిన సందర్భాలు గతంలో లేవు. గుంటూరు ఎంపీ టికెట్‌ పేరుతో అంబటి రాయుడును మోసగించారు. ఆ టికెట్‌ను మరొకరికి కేటాయించడంతో ఆయన వైకాపా నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రజలకు సేవ చేసిన వారికి వైకాపా సీట్లు ఇవ్వలేదు. నన్ను, పవన్‌, లోకేశ్‌ను దూషిస్తేనే టికెట్లు ఇస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజల్లో చైతన్యం తేవాలి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ సిద్ధం కావాలి'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

కొమురవెల్లి మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు

కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి మల్లన్న కల్యాణ వేడుకలుఆదివారం ఉద‌యం అత్యంత ఘనంగా జరిగాయి.

మల్లన్న శరణు శరణు అంటూ జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.

కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివశక్తులు శివాలెత్తి పోయారు.

ఒగ్గు పూజారులు ఆధ్వ ర్యంలో సంప్రదాయ బద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ లను మల్లన్న పెళ్లాడారు. స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆల‌య పాల‌క మండ‌లి, అధికారులు, భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు...

ప్రపంచ ఆరోగ్య సలహాదారుగా ఖమ్మం జిల్లా వాసి

ఖమ్మం పట్టణవాసికి అరుదైన గౌరవం దక్కింది. నగరానికి చెందిన ఐఏఎస్‌ అధికారి అడపా కార్తీక్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియ మితులయ్యారు.

ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన కార్తీక్‌ 2007లో ఐఏఎస్‌ టాపర్‌గా నిలిచారు. అనంతరం పంజాబ్‌ కేడర్‌కు వెళ్లి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం అక్కడే ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగం చేస్తున్న సమ యంలోనే అమెరికాలోని నార్త్‌ కరోలినా విశ్వవిద్యాల యంలో క్యాన్సర్‌ నిర్మూలన అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో రెండేళ్ల పాటు సలహాదారుగా బాధ్యతలు తీసుకోను న్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా కార్తీక్ నియామకం పట్ల అతని బంధువులు, ఖమ్మం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నెలరోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

నెల రోజుల పాలన పై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తి నిచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సేవకులమే తప్ప పాల కులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేను న్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అను భూతిని ఇచ్చిందన్నారు.

పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని వివరించారు.

పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని చెప్పారు.

రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.

రేపటి నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ

రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నం దున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు అధికారు లను ఆదేశించారు.

శనివారం మంత్రి అధికారు లతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు.

ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు. 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.

మిగిలిన రైతులకు కూడా త్వరితగతిన నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశిం చారు. సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు.

ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరో మారు సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతుల సంక్షేమం ,వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు.

గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయ డానికి కట్టుబడి ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రైతాంగం , ప్రజలు రైతుబంధు నిధుల విడుదలపై ఎటువంటి అనుమానాలు పెట్టుకో వాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు....

ఆదిత్య ఎల్ 1,భారత్ కు మరో సంపూర్ణ విజయం

ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించింది. ఆదిత్య ఎల్‌-1ను శనివారం సాయంత్రం విజయ వంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టింది

ఇస్రో. లాగ్రాంజ్ పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో ఆర్బి ట్‌లోకి చేరిన ఆదిత్య ఎల్‌-1 సూర్యుడిపై పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఆదిత్య ఎల్‌ వన్‌ ద్వారా ఇస్రో సూర్యుడి కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై అధ్యయనం చేయనుంది.

గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. అప్పటినుంచి వివిధ దశల ద్వారా లాగ్రాంజ్ పాయిం ట్‌కు ఆదిత్యను పంపారు.

శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఇస్రో నిర్వహించిన 4 దశలు విజయవంతంగా పూర్త య్యాయి. మొత్తం 127 రోజుల పాటు 15లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది ఆదిత్య ఎల్-1. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్‌-1 సేవలు అందించనుంది.

ఇక ఆదిత్య ఎల్-1 ప్రయో గం సక్సెస్ అవడంతో.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ

ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్

ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

ముంబై వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను 30-37 తేడాతో గుజరాత్ జెయింట్స్ ఓడించింది.

మొదట ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌దే పైచేయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఆ జట్టు 19-14తో ఆధిక్యంలో ఉంది.అయితే, సెకండాఫ్‌లో పట్టు కోల్పోయింది.

ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఆలౌటైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ వరుస పాయింట్ల తో పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

రాకేశ్ 10 పాయింట్లు, దీపక్ సింగ్ 9 పాయింట్లతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు టైటాన్స్ తరపున కెప్టెన్ పవన్ 8 పాయింట్లు, సంజీవి 7 పాయింట్లతో పోరాడినప్పటికీ.. మిగతా ప్లేయర్ల నుంచి సహకారం కరువైంది.

మరోవైపు, టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా యు ముంబాను 31-41 తేడాతో ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది.

లోక్ సభ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏఐసీసీ తెలంగాణ ఎన్నికలు కమిటీనీ ప్రకటించింది.

25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరి స్తారు.డిప్యూటీ సీఎం భట్టి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సిం హారెడ్డి, జానారెడ్డి, వీహెచ్, చల్లా వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో పాటు.

మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, రేణుక చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్ సాగర్ రావు, పొదెం వీరయ్య, సునీత రావులకు ఈ కమి టీలో చోటు కల్పించారు

వీరితో పాటు కమిటీలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా కమిటీలో చోటు కల్పించింది.

13 నుంచి జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

ఈ నెల 13వ తదీ నుంచి 16వ తేదీ వరకు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇచ్చా రు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్య లు తీసుకుంటామని ఈమే రకు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యా లకు ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది.

తిరిగి 17వ తేదీన కళాశా లలు ప్రారంభమవు తాయ ని తెలిపింది.ఇంటర్‌ బోర్డు ఆదేశాలను జూనియర్‌ కళాశాలలన్నీ పాటించాలని పేర్కొంది..

తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయంలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వా నించేందుకు ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సహాయ సహకా రాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం తెలిపారు.

వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా మాట్లాడుతూ.. తమ కంపెనీ భవిష్యత్తులో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో రూ.250కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

టైర్-2, 3లలో ఐటీలను అభివృద్ధి పరిచి ప్రమోట్ చేసేందుకు వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యో గాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదన్నారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌ రంజన్, స్పెషల్ సెక్రటరీ విష్ణురెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి , వెల్‌స్పన్‌ గ్రూప్‌ హెడ్ కార్పొరేట్ వ్యవహారాలు చింతన్ థాకర్, శ్రీస భార్గవ మొవ్వ పాల్గొన్నారు.