ఆదిత్య ఎల్ 1,భారత్ కు మరో సంపూర్ణ విజయం
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించింది. ఆదిత్య ఎల్-1ను శనివారం సాయంత్రం విజయ వంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టింది
ఇస్రో. లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బి ట్‌లోకి చేరిన ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఆదిత్య ఎల్ వన్ ద్వారా ఇస్రో సూర్యుడి కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై అధ్యయనం చేయనుంది.
గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. అప్పటినుంచి వివిధ దశల ద్వారా లాగ్రాంజ్ పాయిం ట్‌కు ఆదిత్యను పంపారు.
శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఇస్రో నిర్వహించిన 4 దశలు విజయవంతంగా పూర్త య్యాయి. మొత్తం 127 రోజుల పాటు 15లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది ఆదిత్య ఎల్-1. ఐదేళ్ల పాటు ఆదిత్య ఎల్-1 సేవలు అందించనుంది.
ఇక ఆదిత్య ఎల్-1 ప్రయో గం సక్సెస్ అవడంతో.. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ
Jan 07 2024, 09:59